Why Mrunal Thakur Get Actress Instead Of Doctor
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఈ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మొదట్లో మరాఠీ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ సీతారామం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ చిత్రంలో మృణాల్ తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మంగ్రముగ్ధుల్ని చేసింది. సీతారామం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందీ చిన్నది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి. మృణాల్‌కు స్టార్ హీరో సరసన నటించే అవకాశాలు వచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.మృణాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ప్రతిరోజు రకరకాల ఫొటోలతో అభిమానులను పలకరిస్తుంది ఈ భామ.
ఈ చిన్నదానికి ఇన్‌స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. మొన్నటివరకు మృణాల్ ను 4.5 మిలియన్ ల మంది ఫాలో అయ్యేవారు. సీతారామం సినిమా తర్వాత ఇప్పుడు 5.4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఒకే ఒక్క సినిమా ఈ ముద్దుగుమ్మకు ఇలా మిలియన్ మంది ఫాలోవర్స్ ను పెంచేసింది. ఇక మృణాల్ త్వరలో మహేష్ సరసన నటిస్తుందని ఓ వార్త వినిపిస్తోంది. రాజమౌళి సినిమా కోసం ఈ అమ్మడిని సంప్రదిస్తున్నారని టాక్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు వెల్లడిస్తూ..ఇండస్ట్రీకి ఎలా ఇచ్చిందన్న విషయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ… డాక్టర్ అవ్వాల్సిన నేను యాక్టర్ అయ్యాను.
Why Mrunal Thakur Get Actress Instead Of Doctor
నిజానికి నేను డెంటిస్ట్ కోర్స్ చేశాను. అందుకోసం రాసిన ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు కూడా వచ్చాయి. అయితే నాకు డాక్టర్ కన్నా నటి అవ్వాలనే కోరిక బలంగా ఉండేదని వెల్లడించింది.అయితే అమ్మానాన్న అందుకు ఒప్పుకునే వారు కాదు. ఎలాగైనా వారిని ఒప్పించాలనే ప్రయత్నంలో ఓరోజు వారికి ‘త్రీ ఇడియట్స్’ ను చూపించా. ఆ సినిమా చూసిన తర్వాతే స్వయంగా అమ్మానాన్నే నన్ను ప్రోత్సహించారు. సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించారు. డెంటల్ డాక్టర్ కావాల్సిన నేను నటిగా మారటానికి అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకొని ప్రోత్సహించటం వల్ల అవకాశాల కోసం ఇండస్ట్రీలో అడుగు పెట్టాను అని వెల్లడించింది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఇలా నటిగా అలరిస్తుంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.