Chiranjeevi: ఈ ఏడాది మొత్తం మెగామాస్..రికార్డులన్నీ చిరంజీవివేనా..? అంటే ఎక్కువ శాతం ఆ అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నా రు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా ఖైదీ నంబర్ 150, సైరా నరసింహా రెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత 5 ప్రాజెక్ట్స్ ను లైన్‌లో పెట్టారు. అయితే, కరోనా కారణంగా అన్నీ ప్రాజెక్ట్స్ డిలే అవుతూ వచ్చాయి. చిరు గతంలో ఎప్పుడూ లేనంతగా వరుస ప్రాజెక్ట్స్‌ను కమిటవడం..ఒక్కో ప్రాజెక్ట్ కోసం సరికొత్తగా మేకోవర్ అవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమాను కంప్లీట్ చేశారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇది మెగా మల్టీస్టారర్. చరణ్ మరో హీరో కావడంతో రికార్డులపై అంచనాలు బాగానే ఉన్నాయి.
దీని తర్వాత గాడ్ ఫాదర్ సినిమాతో రానున్నారు మెగాస్టార్. ఇది మలయాళ రీమేక్ మూవీ అయినా భారీ కాస్టింగ్‌తో అసాధారణమైన అంచనాలను పెంచుతూ వస్తోంది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, టాలెంట్ హీరో – ప్రొడ్యూసర్ సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వచ్చి చేరారు. ఇలా భారీ తారాగణం నటిస్తుండటంతో గాడ్ ఫాదర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఈ ఏడాది రిలీజ్‌కు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటే మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో మెగా 154 చేస్తున్నారు. ఈ రెండు సినిమాలలోనూ భారీ స్థాయిలో నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. భోళా శంకర్ సినిమాలో తమన్నా చిరుకు జోడీగా, కీర్తి సురేశ్ చెల్లి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో గ్లామర్ బాగా ఉండబోతోంది. ఇక మెగా 154లో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా మాస్ మహారాజ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే అభిమానులకు పెద్ద పండుగే. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజతో మాంచి గ్లామర్ బ్యూటీ జత కడుతోంది. అంతేకాదు..వీటిలో కూడా ఓ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చేసే సందడి అంతా ఇంతా కాదని చెప్పుకుంటున్నారు. ఇదే కాదు..తన సినిమాలతో ఈ సంవత్సరం చిరు కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.