will gnanamba forgive peter and his wife
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 10 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 406 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ, గోవిందరాజు నవరాత్రుల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పీటర్, ఆయన భార్య జ్ఞానాంబ ఇంటికి వస్తారు. వాళ్లను చూసి షాక్ అవుతారు. జ్ఞానాంబ గారు మీతో మాట్లాడాలి అంటారు. దీంతో చెప్పండి అంటుంది జ్ఞానాంబ. మా కూతురును మీ కొడుకుకు ఇచ్చి పెళ్లి చేశారని చాలా సంతోషించాం కానీ.. ఇప్పుడు నా కూతురును ఇలా ఇబ్బందులు పెడతారని అనుకోలేదు.. అంటాడు పీటర్. నా కూతురును ఎందుకు హింసిస్తున్నారు అని అడుగుతాడు. ఇంతలో అక్కడికి విష్ణు, మల్లిక, రామా, జానకి వస్తారు. ఎవరు మీకు ఈ విషయాలు చెప్పారు అని అడుగుతాడు గోవిందరాజు. ఎవరి చెబితేనేం.. నా కూతురును హింసిస్తున్నారా? లేదా? అని నిలదీస్తాడు పీటర్.
will gnanamba forgive peter and his wife
జానకి, రామా ఎంత చెప్పినా కూడా పీటర్ వినడు. నాకూతురును ఇంతలా బాధపెడుతున్నారు మీరు అసలు మనుషులేనా అని తిడుతాడు. ఇంతలో అక్కడికి జెస్సీ వచ్చి తన పేరెంట్స్ పై విరుచుకుపడుతుంది. మీకు ఎవరు చెప్పారు అని ప్రశ్నిస్తుంది. చెప్పుడు మాటలు విని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇంకోసారి ఎవరో ఏదో చెప్పిన దాన్ని పట్టుకొని మీరు ఇక్కడికొచ్చి మా అత్తయ్య గారిని నిలదీస్తే తల్లిదండ్రులు అని కూడా చూడను అని అంటుంది జెస్సీ. దీంతో మమ్మల్ని క్షమించండి జ్ఞానాంబ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు పీటర్, ఆయన భార్య.
వాళ్లు వెళ్లిపోయాక.. జెస్సీకి థాంక్స్ చెబుతుంది జానకి. మీ వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పావు అంటుంది జానకి. ఆ తర్వాత జెస్సీ వెళ్లి జ్ఞానాంబకు సారీ చెబుతుంది. మా వాళ్ల తరుపున నేను క్షమాపణలు చెబుతున్నా అంటుంది జెస్సీ. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు జానకి చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికొచ్చిన జెస్సీ.. అక్కా నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. కానీ.. నీ చదువు డిస్టర్బ్ అవుతుందేమో అని అంటుంది. పర్వాలేదులే చెప్పు అంటుంది జానకి. దీంతో నాకు అఖిల్ అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉండటం లేదు అంటుంది.
అంటీముట్టనట్టుగానే ఉంటున్నాడు. జీవితాంతం ఇక్కడే ఉండాల్సిన దాన్ని. బాధ్యతలు కూడా చూసుకోవాల్సిన దాన్ని. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఆ విషయంపై నిన్ను సలహా అడుగుదామని వచ్చాను అంటుంది జెస్సీ.
ఆవిడ నీతో అలా ఉండటంలో కొన్ని విషయాల్లోనే అలా ఉంటుంది. అంతే తప్పితే కోడలుగా నువ్వు ఇవాళ చేసింది కరెక్ట్. ఇవాళ మీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించిన తీరు కూడా అద్భుతం. అందుకే అత్తయ్య గారు కూడా నిన్ను ఏమనలేదు.
అత్తయ్య గారికి నీ మీద కాస్త సదాభిప్రాయం ఏర్పడింది. త్వరలోనే అత్తయ్య గారు నిన్ను దగ్గరికి తీస్తారు. సడెన్ గా బాధ్యతలు మీదపడేసరికి ఆ కోపం నీ మీద చూపిస్తున్నాడేమో. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అని చెబుతుంది జానకి. నాకు పండుగల గురించి అన్ని చెప్పు. నేను నేర్చుకొని అన్నీ చేస్తా అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.