Home » Entertainment » Will Janaki Attend Yogi Son Barasala Function In Janaki Kalaganaledu
Entertainment

Janaki Kalaganaledu : జ్ఞానాంబ ఫంక్షన్ కు వెళ్తుందా? యోగిని క్షమిస్తుందా? రుక్మిణి ఏమంటుంది?

Authored By
Varun G
The Telugu News | Updated on: April 30, 2022, 11:44 am
Advertisement

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ సోమవారం, 30 ఏప్రిల్ 2022 ఎపిసోడ్ 291 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి ఫ్రెండ్ రుక్మిణి.. బాబును తీసుకొని జానకి ఇంటికి వెళ్తుంది. మరోవైపు జానకి ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. తన అన్నయ్య కొడుకు బారసాల ఫంక్షన్ కు వెళ్లకుండా ఉన్నందుకు బాధపడుతూ ఉంటుంది. మల్లిక మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది.

Advertisement

will janaki attend yogi son barasala function in janaki kalaganaledu

రామా కూడా ఏం మాట్లాడదు. ఇంతలో ఆటోలో రుక్మిణి జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. తనను చూసి మల్లిక ఆపుతుంది. ఎవరు నువ్వు అని అడుగుతుంది. మల్లికకు గట్టిగానే రుక్మిణి క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత జ్ఞానాంబ, గోవిందరాజు వస్తారు. తనను చూసి ఎవరు అనుకుంటారు. వాళ్లకు నమస్కారం పెడుతుంది రుక్మిణి. నేను జానకి ఫ్రెండ్ ను అని చెబుతుంది.

Advertisement

జానకి వాళ్ల అన్నయ్య కొడుకు బారసాల ఫంక్షన్ కు వచ్చాను. కానీ.. అక్కడ జానకి కనిపించకపోయే సరికి… ఏం జరిగిందని కనుక్కున్నాను. అసలు విషయం తెలిసి షాక్ అయ్యాను అంటుంది రుక్మిణి.

అందుకే.. బాబును తీసుకొని ఇక్కడికి వచ్చాను అంటుంది. జానకిని పలకరిస్తుంది. ఎట్టున్నావు అంటుంది. జానకి చాలా సంతోషిస్తుంది. బాబును తీసుకొని ఎత్తుకుంటుంది. బాబును ఎత్తుకొని జానకి మురిసిపోతుంది.

Advertisement

Janaki Kalaganaledu : జ్ఞానాంబను ఫంక్షన్ కు పిలిచిన రుక్మిణి

తర్వాత జ్ఞానాంబను ఫంక్షన్ కు పిలుస్తుంది రుక్మిణి. ఊళ్లో ఎవరింట్లో శుభకార్యం జరిగినా మీరు తప్పకుండా వెళ్లి దీవించి వస్తారట కదా. అంత మంచి మనసు ఉన్న జ్ఞానాంబ కోడలు పుట్టింట్లో జరుగుతున్న బారసాల ఫంక్షన్ కు రాకపోవడం ఏంటి. మేనల్లుడు బారసాల ఫంక్షన్ కు పోలేకపోతున్నందుకు తన మనసు ఎంత బాధపడుతోందో మీకు సమజైతలేదా అమ్మ అంటుంది రుక్మిణి.

దీంతో జానకి గారిని ఫంక్షన్ కు వెళ్లొద్దని ఎవ్వరూ అనలేదు. వెళ్లి రండి అని మేము చెప్పాం.. అంటాడు రామా. దీంతో ఒక్కతే ఎలా వెళ్తుంది. ఎలా పోగలదు. మీరైనా సోచాయించాలి కదా రామా గారు అంటుంది రుక్మిణి.

చూడండి.. మీరు ఏ విషయం గురించి వచ్చారో నాకు అర్థం అయింది. మా అందరినీ బారసాల ఫంక్షన్ కు తీసుకెళ్లాలని మీ ఆలోచన కావచ్చు. కానీ.. అది జరగదు. దయచేసి మీరు వెళ్లండి అంటాడు రామా.

రామయ్య.. జానకి కష్టం చెప్పకపోయినా అర్థం చేసుకొని తీరుస్తాడని విన్నా. ఇప్పుడు గీ జానకి మనసు బాధపడుతున్నా గీ రామయ్య ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటుంది రుక్మిణి. అంత బాధేమున్నది అంటుంది.

Advertisement

తర్వాత జ్ఞానాంబనుతో పాటు జానకి, కుటుంబ సభ్యులు అందరూ యోగి కొడుకు బారసాల ఫంక్షన్ కు వెళ్తారు. దీంతో బాబును తన చేతుల్లోకి తీసుకుంటుంది జ్ఞానాంబను. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి