
will janaki prepare for exams in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 3 అక్టోబర్ 2022 ఎపిసోడ్ 401 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలు బెనికిందని జానకి అబద్ధం చెప్పి రామా తనను మోసేలా చేస్తుంది. ఆ తర్వాత తనకు ఎటువంటి గాయం కాలేదని చెబుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వస్తారు. రేపు పరీక్ష పెట్టుకొని చదువుకోకుండా జానకి ఇంటి పని చేస్తూ ఉంటుంది. దీంతో రామా వచ్చి మీరేంటి చదువుకోకుండా ఇలా పనిచేస్తున్నారు. వెళ్లి చదువుకోండి అంటాడు రామా. దీంతో పర్వాలేదండి.. నేను ఇంట్లో పనులు, చదువు రెండూ సమానంగా చూసుకోవాలి అంటుంది జానకి. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. ఇంట్లో పనులు చేస్తూ చదువును అశ్రద్ధ చేయకు అంటుంది జ్ఞానాంబ.
will janaki prepare for exams in janaki kalaganaledu
అయినా ఇంట్లో పనులు చేయడానికి కేవలం చికిత, మల్లికే కాదు కదా.. ఇంకా చాలామంది ఉన్నారు అంటుంది జ్ఞానాంబ. దీంతో జెస్సీకి ఇంకా ఏ వస్తువులు ఎక్కడున్నాయో తెలియదు అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో వెనకేసుకురావడం కాదు అంటుంది జ్ఞానాంబ. పనులు చేస్తుంటేనే అలవాటు అవుతాయి అంటుంది జ్ఞానాంబ. నువ్వు వెళ్లి చదువుకో అంటుంది జ్ఞానాంబ. దీంతో తన రూమ్ లోకి వెళ్తుంది. ఇవన్నీ చూసిన మల్లిక వామ్మో.. ఇప్పుడు కానీ నేను కనిపిస్తే నాతోనే పనులు చేయిస్తారు. ఎస్కేప్ అయిపోవాలి అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు తన తల్లిని, అన్న, వదినను నమ్మించడం కోసం అఖిల్ మరో నాటకానికి తెర తీస్తాడు.
మీ ప్రేమ దూరం అవుతుందని తెలిస్తే అసలు జెస్సీని ప్రేమించే వాడినే కాదు అన్నయ్య అంటాడు అఖిల్. ఇంతలో జానకి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది దీని గురించి కాదు. జెస్సీ ఇప్పుడు నీ భార్య. తనను బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీ మీద జెస్సీ బాధ్యత ఉంది అంటుంది జానకి.
ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి వాడేం ఇంకా చిన్నపిల్లాడు కాదు. వాడి గురించి ఎందుకు అంత బాధపడుతున్నారు. వాడికి అన్నీ తెలుసు. ముందు వెళ్లి మీ పనులు చేసుకోండి అని జ్ఞానాంబ.. ఇద్దరికీ చెబుతుంది. దీంతో వామ్మో.. అమ్మను కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు అని అనుకుంటాడు అఖిల్.
మరోవైపు చదువుకున్న జానకి, జెస్సీ ఒక్కటై పోలేరమ్మకు దగ్గరైతే అప్పుడు నా బతుకు ప్రజల దృష్టిలో డిపాజిట్ కోల్పోయిన రాజకీయ నాయకుడిలా దరిద్రంగా ఉంటుంది అని అనుకుంటుంది మల్లిక. అలా జరగకూడదంటే ఏం చేయాలి అని అనుకుంటుంది మల్లిక.
వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెట్టి పోలేరమ్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ జెస్సీ దగ్గర కాకుండా చేయాలి అని అనుకుంటుంది మల్లిక. ఇంకెందుకు ఆలస్యం.. నీ స్క్రీన్ ప్లేను మొదలు పెట్టు అని అనుకుంటుంది. వెంటనే జెస్సీ దగ్గరికి వెళ్తుంది. జానకి గురించి చెడుగా చెబుతుంది మల్లిక.
జానకికి నీ మీద అభిమానం లేదు స్వార్థం అంటుంది మల్లిక. అత్తయ్య గారి దృష్టిలో గొప్ప పేరు కొట్టేయడానికి నిన్ను తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడానికి ఇలా చేస్తోంది అంటుంది మల్లిక. నువ్వు అత్తయ్య గారికి దగ్గరవ్వు అంటుంది మల్లిక. తను అడిగినా అడగకపోయినా తనకు కాఫీ పెట్టి ఇవ్వు, తన పనులు చేయి అంటుంది.
ఇవన్నీ విన్న జానకి తన దగ్గరకు వెళ్లి అనవసరం అయినవి జెస్సీకి నూరిపోస్తున్నావా? తను మన తోటి కోడలు. కొత్తగా ఇంట్లోకి అడుగుపెట్టింది. అత్తయ్య గారికి నచ్చని పద్ధతులు చెప్పి ఆమెకు జెస్సీ మీద కోపం వచ్చేలా చేయకు అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది జానకి.
ఆ తర్వాత రామా కొట్టు నుంచి జానకికి ఫోన్ చేసి చదువుకుంటున్నారా అని అడుగుతాడు. దీంతో చదువుతున్నా అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.