Home » Entertainment » Will Mallika Plan Against Janaki Succeed In Janaki Kalaganaledu
Entertainment

Janaki Kalaganaledu : మల్లిక ప్లాన్ రివర్స్.. జానకికి ప్రాణాపాయం.. జానకిని రామా కాపాడుతాడా? ఈ విషయం జ్ఞానాంబకు తెలుస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: July 9, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 11 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 341 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి, రామా ఏకాంతంగా ఉండటాని చూడలేక.. వాళ్ల ఏకాంతాన్ని డిస్టర్బ్ చేసి.. ఇక 5 సెంట్ల భూమి నాకే. వెంటనే పిల్లలను కనే పనిలో ఉండాలి అని అనుకుంటుంది మల్లిక. రామా గారిని ఎంత కన్విన్స్ చేద్దామన్నా అస్సలు వినడం లేదు. ఆయనను ఎలా ఒప్పించాలి అని కంగారు పడుతుంది జానకి. నా కోసం ఆయన సంసార జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు అని అనుకుంటుంది జానకి. మరోవైపు మనం కూడా పిల్లలను కందాం అని విష్ణుతో చెబుతుంది మల్లిక. త్వరగా పిల్లలను కనేసి ఆ 5 సెంట్లు కొట్టేద్దాం అని చెప్పి అక్కడే ఉన్న అరటి తొక్క మీద కాలు పెట్టి కింద పడుతుంది మల్లిక.

Advertisement

janaki kalaganaledu 9 july 2022 full episode

మరోవైపు ఇవాళ ఏరువాక పౌర్ణమి అని అందరం పొలానికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించాలని.. అందరూ తొందరగా రెడీ అవ్వాలని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో అందరూ రెడీ అయి పొలానికి బయలుదేరుతారు. రామా, జానకి ఇద్దరూ బండి మీద వెళ్తుంటారు. ప్రతి రోజు జానకి గారికి ఏదో ఒక అడ్డంకి వస్తోంది. ఇలా అయితే తను ఐపీఎస్ చదువు ఎప్పుడు పూర్తి చేస్తుంది అని టెన్షన్ పడతాడు రామా. ఏంటి మీరు ఏం మాట్లాడటం లేదు అని అడుగుతుంది జానకి. దీంతో ఏం లేదు అని అంటాడు రామా. తర్వాత అందరూ పొలం దగ్గరికి వెళ్తారు.

Advertisement

పూజ నిర్వహించాక.. ఏరువాక సాగడం కోసం మగాళ్లు పలుగు, పార పట్టుకోవాలి.. ఆడవాళ్లు విత్తనాలు పట్టుకొని వాళ్ల వెనుకే విత్తనాలు నాటుతూ వెళ్లాలి అని చెబుతుంది జ్ఞానాంబ. విత్తనాలు చల్లేటప్పుడు మధ్యలో ఎలాంటి ఆటంకాలు రాకూడదు. అలా ఆటంకం వస్తే ఈ సంవత్సరం పంట పండటంలోనూ అడ్డంకులు వస్తాయని నమ్ముతారు అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu : జానకి కాళ్లకు తన కాలును అడ్డం పెట్టిన మల్లిక

ఇదేదో బాగుందే. జానకిని ఎలాగైనా ఏదోలా అడ్డంకులు సృష్టించి.. పోలేరమ్మతో తిట్టించాలి అని అనుకుంటుంది. రామా, విష్ణు ఇద్దరూ పలుగు పార పట్టుకొని భూమిని తవ్వుతూ ఉంటారు. జానకి, మల్లిక, జ్ఞానాంబ ముగ్గురూ విత్తనాలు వేస్తూ వెళ్తుంటారు.

Advertisement

ఇంతలో జానకి కాళ్లకు తన కాలును అడ్డం పడుతుంది మల్లిక. దీంతో జానకి పట్టు తప్పి ముందు ఉన్న గడ్డపార మీద పడబోతుంది. ఇంతలో రామా వచ్చి తనను పట్టుకుంటాడు. తనను కాపాడుతాడు. ఇంకొంచెం ఉంటే జానకికి గడ్డపార గుచ్చుకునేది. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

వామ్మో.. ఏదో జానకిని కిందపడేద్దామనుకున్నా కానీ.. ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటుంది మల్లిక. విత్తనాలు కూడా కింద పడకుండా జానకిని జాగ్రత్తగా పట్టుకుంటాడు రామా. దీంతో మల్లిక షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి