
will parandamaiah go with anasuya in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 21 నవంబర్ 2022, ఎపిసోడ్ 795 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే. తప్పదు అంటాడు పరందామయ్య. ఈ ఇంట్లో వాళ్ల సంతోషాన్ని నువ్వు నాశనం చేయడానికి నేను ఒప్పుకోను అంటాడు పరందామయ్య. నీ జీవితాన్ని ఎవ్వరూ నాశనం చేయలేదు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అంటాడు పరందామయ్య. దీంతో నా జీవితాన్ని సగం నువ్వు నాశనం చేస్తే.. మిగితా సగం ఇదిగో ఇది నాశనం చేసింది అని అనసూయ తులసిపై సీరియస్ అవుతుంది. దీంతో నా కూతురు పేరెత్తకు అనసూయ అంటాడు పరందామయ్య.
will parandamaiah go with anasuya in intinti gruhalakshmi
నేను ఇక్కడి నుంచి అస్సలు కదలను అంటుంది అనసూయ. నీకు దండం పెడతాను అని పరందామయ్య అన్నా వినదు. అత్తయ్య ఏదైనా మాట అనే ముందు కొద్దిగా ఆలోచించుకోండి. కోపంలో అన్నమాటను వెనక్కి తీసుకోలేం అంటుంది తులసి. దీంతో తులసిని నెట్టేస్తుంది అనసూయ. అనసూయ చచ్చిపోయింది అంటుంది. అయినా ఇది మీ ఇల్లు కాదు. తులసి ఇల్లు. నన్ను వెళ్లమని దాన్ని చెప్పమనండి. మీరెవరు చెప్పడానికి అంటుంది అనసూయ. దీంతో నేను నీ భర్తను అంటాడు పరందామయ్య.
దీంతో మీరు ఏనాడైనా భర్తగా నిలబడ్డారా? కనీసం పిల్లలకు అయినా బాధ్యతగా పెంచారా? పెళ్లయ్యాక మీ దగ్గర ఏముంది. చేతుల్లో రూపాయి లేదు. నేను ఎన్ని కష్టాలు పడుతూ కుటుంబాన్ని పెంచానో నాకు తెలుసు అంటుంది అనసూయ. పెళ్లిలో అత్తగారు కనీసం నాకు బంగారు ముక్కుపుడక కూడా పెట్టలేదు.. అంటుంది. దీంతో అప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు అనసూయ అంటాడు పరందామయ్య.
దీంతో అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటుంది. ఎక్కువ రోజులు నువ్వు ఆ ఇంట్లో ఉండలేదు కదా. మనకోసం అని నా కష్టంతో ఇల్లు కట్టించాను అంటాడు పరందామయ్య. దీంతో అది ఒక ఇల్లా అంటుంది అనసూయ. సంసారాన్ని నేను నెలకు నీకు వచ్చే 400 జీతంతో మోసాను అంటుంది.
సంపాదన తక్కువే. ఆయనకు తెలియదు పాపం. ఈ కాలంలో డబ్బుకు తప్ప ప్రేమ, ఆప్యాయతలకు ఎలాంటి విలువ ఉండదని. తెలిసి ఉంటే జాగ్రత్త పడేవారేమో.. అంటుంది తులసి. అందరూ మీరు భర్త గౌరవాన్ని తగ్గించకండి అని అనసూయకు చెప్పినా కూడా వినదు అనసూయ.
ఎవరు చెప్పినా అనసూయ వినదు. దీంతో నేను ఎక్కడికీ రాను అని మంకుపట్టు పడతాడు పరందామయ్య. కళ్లు తిరిగి కింద పడబోతుండగా ఆయన్ను కుర్చీలో కూర్చోబెడతారు. అనసూయపై సీరియస్ అవుతుంది తులసి. నువ్వు ఇంకో మాట మాట్లాడితే బాగుండదు అంటుంది తులసి.
దీంతో అనసూయ నోర్మూసుకుంటుంది. మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండండి. ఇది మీ ఇల్లు.. కాదు మన ఇల్లు అంటుంది తులసి. దీంతో పరందామయ్య చాలా సంతోషిస్తాడు. ఆయనకు నేను అవసరం లేదంటే.. నాకు కూడా ఆయన అవసరం లేదు అంటుంది అనసూయ.
తర్వాత పరందామయ్య ఇంట్లో కనిపించకపోయే సరికి టెన్షన్ పడుతుంది తులసి. వెంటనే సామ్రాట్ కు ఫోన్ చేస్తుంది. మామయ్య కనిపించడం లేదని చెబుతుంది. దీంతో సామ్రాట్, తులసి ఇద్దరూ కలిసి పరందామయ్య కోసం వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.