Home » Entertainment » Will Prem Escape Arrest In Intinti Gruhalakshmi
Entertainment

Intinti Gruhalakshmi : తులసిని ఉద్యోగంలో నుంచి సామ్రాట్ తీసేస్తాడా? ఈ విషయం తెలిసి తులసి ఏం చేస్తుంది?

Authored By
Varun G
The Telugu News | Updated on: October 2, 2022, 9:08 am
Advertisement

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 3 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 753 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ ను ఆడిషన్ లో సెలెక్ట్ అయినందుకు మరో వ్యక్తి అడ్డుకుంటాడు. నువ్వు రెకమండేషన్ మీద వచ్చావంటాడు. దీంతో కోపం వచ్చి రాకేశ్ పై చేయి చేసుకుంటాడు ప్రేమ్. దీంతో ఆఫీసు వాళ్లు పోలీసులను పిలుస్తారు. దీంతో పోలీసులు వచ్చి ప్రేమ్, రాకేశ్ ను తీసుకెళ్తారు. మరోవైపు అనసూయ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు సామ్రాట్. మీటింగ్ జరుగుతున్నా దాని మీద దృష్టి పెట్టడు. దీంతో తులసి చూసి ఏమైంది అని మెసేజ్ పెడుతుంది. దీంతో ఏం లేదు అంటాడు. కానీ.. అతడు చాలా డిస్టర్బ్ గా ఉన్నట్టు తులసి కనిపెడుతుంది.

Advertisement

will prem escape arrest in intinti gruhalakshmi

ఇంతలో సామ్రాట్ కు ఫోన్ వస్తుంది. ప్రేమ్ ఫోన్ చేస్తాడు. తనను పోలీసులు పట్టుకెళ్లినట్టు తను పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు చెబుతాడు. దీంతో వెంటనే నేను వస్తున్నా అని చెప్పి సామ్రాట్ స్టేషన్ కు బయలుదేరుతాడు. మరోవైపు పోలీస్ స్టేషన్ సెల్ లోనే మరోసారి ప్రేమ్, రాకేశ్ ఇద్దరూ కొట్టుకుంటారు. వీడు పెద్ద ప్రతివ్రత కొడుకు అనుకుంటున్నాడు. వీడి అమ్మ, సామ్రాట్ గురించి అందరికీ తెలుసు అంటూ పోలీసుల ముందే ఏదేదో వాగుతాడు రాకేశ్. దీంతో ఎస్ఐ ఇద్దరినీ తీసుకొచ్చి బయట కూర్చోబెడతాడు.

Advertisement

ఇంతలో అక్కడికి సామ్రాట్ వస్తాడు. ప్రేమ్ ను వదలిపెట్టండి అంటాడు. దీంతో తను మీకు ఏమౌతాడు అంటాడు ఎస్ఐ. దీంతో రాకేశ్ రెచ్చిపోతాడు. వాళ్ల అమ్మను ఏదో అన్నానని వీడు తెగ రెచ్చిపోయి నన్ను కొట్టాడు. మీరు చెప్పండి.. కొడుకు లాంటోడని చెప్పండి ఏం కాదు.. అంటాడు రాకేశ్.

Intinti Gruhalakshmi : సామ్రాట్ గారి దత్త పుత్రుడా అని ప్రేమ్ ను అన్న రాకేశ్

ప్రేమ్ ను మరింత రెచ్చగొట్టి రాకేశ్ మాట్లాడుతాడు. సామ్రాట్ గారి దత్త పుత్రుడా అంటాడు. దీంతో కోపంతో ప్రేమ్ మళ్లీ అతడిపై చేయి చేసుకోబోతాడు ప్రేమ్. దీంతో ఆగు ప్రేమ్ అంటూ సామ్రాట్ ప్రేమ్ పై చేయి చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ్ ను అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాడు.

Advertisement

ఈ గొడవలు మా అమ్మకు తెలియనీయకండి సార్. మన మధ్యే ఉండాలి అంటాడు ప్రేమ్. మరోవైపు లంచ్ టైమ్ అవుతున్నా ఇంకా రావడం లేదేంటని.. తులసి సామ్రాట్ కు ఫోన్ చేస్తుంది. దీంతో సామ్రాట్ చిరాకు పడతాడు. ఫోన్ లిఫ్ట్ చేయడు. అయినా తులసి వినకుండా ఫోన్ చేస్తుంది.

దీంతో ఏంటి అన్నిసార్లు కాల్ చేస్తున్నారు అంటాడు సామ్రాట్. నేను లంచ్ కు రావట్లేదు అంటాడు సామ్రాట్. కట్ చేస్తే తులసి ఇంటికి వస్తుంది. తులసిని చూసి అనసూయ భయపడుతుంది. తులసి ఏంటి ఇంత కూల్ గా ఉంది. సామ్రాట్ నా మాట వినలేదా అని అనుకుంటుంది అనసూయ.

మరోవైపు ఫైల్ విషయంలో నాకు ఎందుకు అబద్ధం చెప్పావని ఝాన్సీని అడుగుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి