Home » Entertainment » Will Rama Participate In Food Compitition In Janaki Kalaganaledu
Entertainment

Janaki Kalaganaledu : ఘనంగా రామా పుట్టిన రోజు వేడుకలు.. కన్నబాబు షాకింగ్ నిర్ణయం.. రామా ఒప్పుకుంటాడా?

Authored By
Varun G
The Telugu News | Updated on: May 21, 2022, 11:42 am
Advertisement

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 23 మే 2022, సోమవారం ఎపిసోడ్ 306 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకిని కొత్తగా, వింతగా చూస్తాడు. రామా.. దీంతో నన్నేంటి చాలా కొత్తగా చూస్తున్నారు అని అడుగుతుంది జానకి. దీంతో అవును జానకి గారు.. చాలా కొత్తగా కనిపిస్తున్నారు.. అంటాడు రామా. నా ప్రతి పుట్టిన రోజుకు మా అమ్మ నాకు తలస్నానం చేయించి.. దూపం వేసేది. ఈ పుట్టిన రోజుకు మా అమ్మ స్థానాన్ని మీరు తీసుకున్నారు.. అంటాడు రామా. మన పెళ్లి అయిన కొత్తలో అత్తయ్య గారు ఒక మాట చెప్పారు. అప్పటి వరకు అత్తయ్య గారు మీ మీద చూపిస్తున్న బాధ్యతను నన్ను తీసుకోమన్నారు. అందుకే.. నేను ఇప్పుడు అత్తయ్య గారి బాధ్యతను తీసుకున్నాను అంటుంది జానకి. ముందు వెళ్లి మీరు బట్టలు మార్చుకొని రండి అంటుంది జానకి. రామా వెళ్లి పంచె కట్టుకొని వస్తాడు. జానకి పంచెలో రామాను చూసి మురిసిపోతుంది.

Advertisement

will rama participate in food compitition in janaki kalaganaledu

మా ఆయన అచ్చం కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు అంటుంది. నా దిష్టే తగిలేలా ఉంది అని మురిసిపోతుంది. జానకి గారు.. నాకు సిగ్గేస్తోంది అంటాడు రామా. దీంతో మీకు సిగ్గేస్తుందా అంటుంది జానకి. జానకి గారు.. మా అమ్మ నాతో ఎప్పుడూ ఏం చెబుతుందో తెలుసా? మనిద్దరం ఎప్పటికీ ఇలాగే అన్యోన్యంగా సంతోషంగా ఉండాలని అంటాడు రామా. మరోవైపు చికితను పిలుస్తుంది జ్ఞానాంబ. ఇంకా మరిచిపోయావా.. కుంకుడు కాయ రసం సిద్ధం చేశావా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో చేశానండి.. కానీ జానకమ్మ గారు తీసుకెళ్లారు అంటుంది. రామా గారికి జానకి గారు తల స్నానం చేయించి ఉంటారు అంటుంది. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. నా బిడ్డ పుట్టిన రోజుకు నా చేతులతో తలస్నానం చేయించాలనుకున్నాను. ఆ విషయం జానకికి ముందే తెలిసినట్టుంది.. అని అనుకుంటుంది.

Advertisement

కనీసం సాంబ్రాని అయినా తీసుకురా… అదయినా వేస్తాను అంటుంది జ్ఞానాంబ. దీంతో అది కూడా జానకి గారు వేశారు. అంతే కాదు.. కొత్త బట్టలు కూడా వేశారు.. అని అంటుంది చికిత. పెళ్లి కాకముందు.. పెదబాబు గారి బాధ్యతను మీరు చూసుకున్నారు. పెళ్లయ్యాక.. ఇప్పుడు మీ బాధ్యతను జానకమ్మ గారు తీసుకుంటున్నారు అని అంటుంది చికిత.

Janaki Kalaganaledu : ఈ అమ్మనే మరిచిపోయాడా.. అని బాధపడిపోయిన జ్ఞానాంబ

వాడు మరిచిపోయాడు.. కాదు ఆ జానకే నా కొడుకును మార్చేసింది. తన చదువుకున్న తెలివి తేటలతో ముందు ముందు ఇంకెతలా మార్చేస్తుందో. నా బిడ్డను ఈ అమ్మ నుంచి దూరం చేసినా చేసేస్తుంది అని భయపడుతుంది జ్ఞానాంబ. మరోవైపు రామా డ్రెస్ వేసుకొని రెడీ అవుతుండగా.. కన్నబాబు ఫోన్ చేస్తాడు.

Advertisement

ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు. నా దగ్గర అప్పు తీసుకున్న గడువు గుర్తు చేయడానికి చేశాను అంటాడు కన్నబాబు. దీంతో గడువు లోపు నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పాను కదా అంటాడు రామా. దీంతో నీ మాటలలో నువ్వు అప్పు తీరుస్తావని నమ్మకం లేదు అంటాడు కన్నబాబు.

నువ్వు అప్పు తీర్చాలంటే మీ అమ్మను అడగాలి లేదంటే.. ఏదైనా అద్భుతం జరగాలి. నువ్వు అప్పు తీర్చలేవని నేను ఫిక్స్ అయిపోయా. అందుకే.. ఐదు రోజుల్లో వచ్చి షాపు నా సొంతం చేసుకుంటాను అని అంటాడు కన్నబాబు. రామా ఫోన్ లో మాట్లాడటం వింటుంది జానకి.

రామాను ఓదార్చుతుంది. అందుకే.. మీరు బెస్ట్ చెఫ్ పోటీలకు వెళ్లాలి అంటుంది జానకి. మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది కానీ.. ఆ పోటీలకు వెళ్లడానికి అమ్మ ఒప్పుకోలేదు కదా అంటాడు రామా. దీంతో అక్కడ మీరు ఏదైనా ఇబ్బంది పడతారేమో అన్న భయం అంటుంది జానకి.

ఆ భయాన్ని పోగొట్టి.. మీరు ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం కలిగిస్తే అత్తయ్య గారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అంటుంది జానకి. కొడుకు గురించి 10 మంది గర్వంగా మాట్లాడుతుంటే అత్తయ్య గారికి అంతకన్నా సంతోషం మరొకటి ఉంటుందా అని అంటుంది జానకి.

Advertisement

అత్తయ్య గారికి అర్థం అయ్యేలా చెబుదాం. అప్పుడు అత్తయ్య గారు ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది అని చెప్పి లూసీకి ఫోన్ చేస్తుంది జానకి. మీ భర్తను పార్టిసిపేట్ చేయమని చెప్పండి అంటుంది. కానీ.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సమయం అయిపోయింది కానీ.. నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది అంటుంది.

మీరు ఇక్కడికి వచ్చి ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి అంటుంది లూసీ. దీంతో నేను ఇంకో గంటలో వెళ్లిపోతున్నాను అంటుంది లూసీ. ఇదే మీకు లాస్ట్ చాన్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లూసీ. కానీ.. జానకికి పూజ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాదు. జానకి ఫోన్ లో మాట్లాడటం వింటుంది జ్ఞానాంబ. ఓవైపు పూజ పెట్టుకొని ఇప్పుడు ఫోన్ లో మాట్లాడటం ఏంటి. పూజారి గారు వచ్చే సమయం అయింది. వెళ్లి మిగితా పనులు చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.

మరోవైపు రామా, జానకి కౌగిలించుకొని ఉండటం చూసి షాక్ అవుతుందిబ జ్ఞానాంబ. పూజ అయిపోయే వరకు నియమ నిష్టలతో ఉండాలని అంటుంది జ్ఞానాంబ. రేపు ఉదయం వరకు మీరు ఎక్కడికీ వెళ్లొద్దని పూజారి చెప్పారని అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి