
will vasudhara father accept rishi to come in his house
Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 26 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 643 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార.. తన చదువుకున్న కాలేజీని రిషికి చూపిస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కాలేజీ అంతా తిరిగి చూస్తారు. ఇంతలో జగతి ఇచ్చిన గిఫ్ట్ గుర్తుకు వచ్చి రిషి.. వసుధారకు ఆ గిఫ్ట్ ను ఇస్తాడు. దీంతో ఏంటిది అని అడుగుతుంది వసుధార. దీంతో ఏమో నాకు తెలియదు. మేడమ్ ఇచ్చారు. నీకు ఇవ్వమన్నారు అంటాడు రిషి. దీంతో దాన్ని ఓపెన్ చూద్దామని అనుకునేలోపు.. మహీంద్రా రిషికి పోన్ చేస్తాడు. అక్కడ అంతా ఓకేనా అని అడుగుతాడు. దీంతో డాడ్.. నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇక్కడ అంతా సేఫే అంటాడు.
will vasudhara father accept rishi to come in his house
ఆ తర్వాత తన ఇంటి దగ్గరికి కారు వెళ్లగానే కారు ఆపేయమంటుంది వసుధార. మీరు ఇక్కడే ఉండండి. ముందు నేను ఇంటికి వెళ్తాను. నేను ఇంటికి వెళ్లిన తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను అంటుంది వసుధార. దీంతో సరే అని అక్కడే ఉండిపోతాడు రిషి. ఆ తర్వాత వసుధార తన ఇంటికి బ్యాగు తీసుకొని బయలుదేరుతుంది. మరోవైపు దేవయాని.. జగతి దగ్గరికి వెళ్లి మళ్లీ గొడవ పడుతుంది. దీంతో ఎందుకు మీరు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు. ఇన్ని రోజులు నన్ను మహీంద్రాకు, రిషికి దూరం చేశారు. మీరు ఏం సాధించారు. మీకు ఏం ఒరిగింది. నేను ఇంటికి రావడం మీకు ఇష్టం లేదు. మీకు అన్నింటికీ అనుకూలంగానే ఉంటున్నాను కదా. మీ మాటకు ఎదురు చెప్పడం లేదు. ఇప్పుడు వసుధారను అడ్డం పెట్టుకొని రిషి, వసుధారను విడదీయాలని చూస్తున్నారా? మనుషులును, మనసులను విడదీసి మీరేం బాగుపడతారు. ఇన్నాళ్లు ఏం సాధించారు. ఇప్పుడు ఏం సాధించబోతున్నారు. ఒక్క నిమిషం ఆలోచించండి అక్కయ్య అంటుంది జగతి.
మీకు నిద్రపట్టడం లేదు కదా.. అందరూ కలిసి ఉంటే చూసి సంతోషించాలి అక్కయ్య. అందరినీ విడదీసి.. పైశాచిక ఆనందం పొందడం కరెక్ట్ కాదుద అంటుంది జగతి. దీంతో నువ్వేనా జగతి మాట్లాడుతుంది అంటే ఇంతకంటే ఎక్కువగా, గట్టిగా మాట్లాడగలను అంటుంది జగతి.
నన్ను ఏమన్నా ఓకే కానీ.. నా కొడుకు జోలికి మాత్రం పోవద్దు. రిషి, వసుధార బంధాన్ని చెడగొట్టాలని చూడొద్దు.. ప్రయత్నించొద్దు అంటే.. ప్రయత్నిస్తా అంటుంది దేవయాని. నాకు ఉన్నంత ఓపిక వసుకు లేదు. మీ మీద గౌరవంతో భరిస్తున్నాను. కానీ.. మీ జులం ఇంకెన్నాళ్లు సాగదు అంటుంది జగతి.
ఏ వసుధారను మీరు రిషికి దూరం చేయాలని చూస్తున్నారో.. అదే వసుధార రిషికి మీ నిజ స్వరూపం తెలిసేలా చేస్తుంది. మీరు చేసిన పనులన్నీ రిషికి అర్థం అయ్యేలా ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు చెబుతుంది. అప్పుడు రిషి మిమ్మల్ని అడిగితే మీ దగ్గర సమాధానం ఉండదు అక్కయ్య.
రిషికి నేను చెప్పడం కంటే.. తనంతట తాను తెలుసుకుంటాడని నేను ఇన్నాళ్లు ఆగాను. కానీ.. వసు ఆగుతుందని నేను అయితే అనుకోవడం లేదు అంటుంది జగతి. మీకు సంబంధించి అన్ని విషయాలు రిషికి తెలిస్తే.. మీరేం సమాధానం చెబుతారు అంటూ ప్రశ్నిస్తుంది జగతి.
ఈ విషయం వసుధార చెబుతుందో లేదో కానీ.. నువ్వే ఉసిగొల్పేలా ఉన్నావు. నాకు బాగా అర్థం అవుతోంది జగతి. మీరిద్దరూ కలిసి రిషిని నన్ను వేరు చేయాలని ప్లాన్ చేసినట్టున్నారు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో.. ఈ సంబంధం ఎలా కుదుర్చుకుంటారో నేను చూస్తాను.
నా ముందు గట్టిగా మాట్లాడటానికి భయపడే నువ్వు కూడా గొంతెత్తి అరుస్తున్నావంటే విషయం ఎంత దూరం వెళ్లిందో నేను అర్థం చేసుకోగలను. ఇక ఉపేక్షించి లాభం లేదు. నీ సంగతి, ఆ వసుధార సంగతి చూసి తీరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని.
మరోవైపు వసుధార.. తన ఇంటి గేటు ముందుకు వెళ్తుంది. తన అమ్మను చూసి అమ్మ అని పిలుస్తుంది. తన తండ్రి అక్కడే పేపర్ చదువుతూ ఉంటాడు. తనను చూసి ఎందుకు వచ్చావు అంటూ గట్టిగా మాట్లాడుతాడు చక్రపాణి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
This website uses cookies.