
Will yogi take back the case against jnanamba
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 8 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 276 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా అత్తయ్య గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. వెళ్లి కంప్లయింట్ వెనక్కి తీసుకో అంటుంది జానకి. కానీ.. యోగి మాత్రం నేను కంప్లయింట్ వాపస్ తీసుకోను అంటాడు యోగి. నువ్వు కూడా పోలీస్ స్టేషన్ కు రా.. స్టేట్ మెంట్ ఇవ్వాలి అని జానకిని తీసుకెళ్లబోతాడు యోగి. దీంతో రామాకు మరింత కోపం వస్తుంది. మా అమ్మను జైలుకు పంపిస్తావా? నేను ఊరుకోను. నిన్ను ఏం చేస్తాను అంటూ కోపంతో రగిలిపోతాడు రామా.
Will yogi take back the case against jnanamba
ఆగండి రామా గారు.. అంటుంది. జానకి గారు మీరేం చేస్తారో నాకు తెలియదు. మా అమ్మ గారు గంటలో ఇంట్లో ఉండాలి. లేకపోతే మీ అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. గంట దాటితే రాముడు రావణాసూరుడు అవుతాడు అంటాడు రామా. దీంతో చూశావా జాను… మీ మంచికోసం.. ఇదంతా చేస్తే బావ గారు ఏం చేశారో చూశావా.. నన్ను కొట్టారు చూశావా అంటాడు యోగి. దీంతో అన్నయ్య నువ్వు ముందు వెళ్లి కంప్లయింట్ వెనక్కి తీసుకో అంటుంది జానకి. కానీ.. యోగి మాత్రం నేను కంప్లయింట్ వెనక్కి తీసుకోను.. అది జరగని పని అని చెప్పి అక్కడి నుంచి యోగి వెళ్లిపోతాడు.
దీంతో రామా దగ్గరికి వచ్చిన జానకి.. నేను వెళ్లి ఎలాగైనా అన్నయ్య ఫిర్యాదు వాపస్ తీసుకునేలా చేస్తా అంటుంది జానకి. దీంతో ఈ విషయం మీకు ముందే తెలుసు కదా అంటాడు రామా. దీంతో జానకి షాక్ అవుతుంది. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అంటుంది జానకి.
మా అమ్మ మీద మీ అన్నయ్య పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయాలనుకున్న విషయం మీకు ముందే తెలుసు కదా అంటాడు రామా. దీంతో రామా గారు మీరేనా ఇలా అంటుంది. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు మాటలు రావడం లేదు. మా అన్నయ్య అమెరికా నుంచి వచ్చింది కూడా నాకు తెలియదు అంటుంది జానకి.
మరి.. ఈ విషయాలన్నీ మీ అన్నయ్యకు ఎలా తెలుసు అని అడుగుతాడు రామా. రామా గారు.. మీరు నన్ను అనుమానిస్తున్నారా అంటుంది జానకి. ఏం మాట్లాడాలో మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది జానకి. మీరు నన్ను ఇలా నిందిస్తూ మాట్లాడుతారని నేను అస్సలు అనుకోలేదు అంటుంది జానకి.
నేనే కాదు ఎవ్వరైనా ఇలాగే అనుకుంటారు. మీకు తెలియకుండా మీ అన్నయ్య ఇలా చేశాడు అంటే ఎవ్వరూ నమ్మరు అంటాడు రామా. దీంతో జానకి షాక్ అవుతుంది. మీ కోపంలో అర్థం ఉంది. పోలీస్ స్టేషన్ లో తల్లి ఉంటే ఎవ్వరైనా ఇలాగే చేస్తారు. కానీ ఒక్క విషయం రామా గారు.. నాకు నిజంగా మా అన్నయ్య కేసు పెట్టే విషయం ముందే తెలియదు.. అంటుంది జానకి.
నేను ఏ తప్పు చేయకపోయినా ఈ విషయంలో దోషిగా నిలబడ్డాను కాబట్టి అత్తయ్య గారు అరెస్ట్ అవడం వెనుక నా ప్రమేయం లేదని నేను నిరూపించుకుంటాను. వెళ్లి అత్తయ్య గారిని ఇంటికి తీసుకొస్తాను. లేకపోతే ఎప్పటికీ ఇక్కడికి రాను రామా గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి.
వెంటనే యోగి ఇంటికి వెళ్తుంది జానకి. మా అత్తయ్య గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.. అంటుంది జానకి. వెంటనే కేసు వాపసు తీసుకో అంటుంది. కానీ.. యోగి మాత్రం వినడు. నీకు రామాతో విడాకులు ఇప్పించి మాతో పాటు అమెరికాకు తీసుకెళ్తాం అంటాడు యోగి.
ఆరోజు నీదగ్గర విడాకులు కాగితాలు తీసుకున్న దగ్గర్నుంచి.. ఈరోజు నిన్ను బయటికి పంపించడం వరకు అన్ని విషయాలు నాకు తెలుసు.. అంటాడు. ఆ తర్వాత యోగి.. జానకిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తాడు. అక్కడ ఎస్ఐకి స్టేట్ మెంట్ ఇవ్వమంటాడు.
దీంతో మా అత్తయ్య గారు నన్ను చాలా బాధపెట్టారు అంటుంది జానకి. చాలా కష్టపెట్టారు అంటుంది. ఇది నిజం అంటుంది. అవును ఎస్ఐ గారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి మాట నిజం అంటుంది జానకి. దీంతో మా చెల్లెలు చెప్పిన మాటలు విన్నారు కదా. ఇక మీ ఫార్మాలిటీస్ మీరు పూర్తి చేయండి అని అంటాడు యోగి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
America : అగ్రరాజ్యం అమెరికా అంటేనే ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన గౌరవం. తమ దేశానికి చెందిన ఒక్క వ్యక్తి ప్రాణాలకు…
Ajit Doval : రష్యా ఉప ప్రధానమంత్రి డెన్నిస్ మాంట్రువ్ ఇటీవల భారత పర్యటనకు రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద…
Rahul Gandhi : ఎన్నికల రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు చేసే…
Modi : భారత్ మరియు ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న చమురు మరియు గ్యాస్ సరఫరా వ్యవహారం అంతర్జాతీయంగా…
Revanth Reddy : తెలంగాణ Telangana State రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే…
Summer Business Idea : వేసవి కాలం వచ్చేసింది.. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఎండల్లో…
PM Kisan 23rd installment : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి, పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…
Gold Silver Rate April 6th 2026 : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పసిడి ధరలకు…
Karthika Deepam 2 April 6th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్‌లో ప్రసారం అవుతూ,…
Summer Buttermilk : ఎండలు మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగను మించిన పానీయం మరొకటి లేదు. సాధారణంగా మజ్జిగ…
Mango : వేసవి కాలం రాగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండు. అయితే పచ్చి మామిడికాయ మరియు…
Iced Tea Iced Coffee : వేసవి కాలంలో చల్లటి పానీయాలు తాగడం అందరికీ ఇష్టమే కానీ బరువు తగ్గాలని…
This website uses cookies.