Home » Entertainment » Without Marriage Heroine Ileana Got Pregnant
Entertainment

Ileana : పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఇలియానా..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 18, 2023, 10:08 am
Advertisement

Ileana : హీరోయిన్ ఇలియానా అందరికీ సుపరిచితురాలే. 2005వ సంవత్సరంలో YVS చౌదరి దర్శకత్వంలో “దేవదాసు” సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. రెండో సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “పోకిరి”తో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ గోవా బ్యూటీ. దీంతో తెలుగు చలనచిత్ర రంగంలో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఓవర్ నైట్ లో మారిపోయింది. ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ ఇంకా చాలామంది కుర్ర హీరోలతో అవకాశాలు అందుకొని సినిమాలు చేయడం జరిగింది.

Advertisement

తెలుగులో మాత్రమే కాదు సౌత్ లో… బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలియానా సత్తా చాటింది. హిందీలో స్టార్టింగ్ లో పలు విజయాలు అందుకున్న ఇలియానా తర్వాత మర్రి కొన్నాళ్లు పరాజయాలు ఎదురుకావడంతో.. సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కొంతమందితో ప్రేమ యవ్వారం నడిపి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మళ్లీ సినిమా రంగంలో రీఎంట్రీ ఇచ్చింది అయినా గాని ఫ్లాపులు పలకరించడంతో.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది.

Advertisement

without marriage heroine Ileana got pregnant

 

Advertisement

ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయాలు గురించి అభిమానులకు సోషల్ మీడియాలో రకరకాల విషయాలు ఇలియానా తెలియజేస్తూ వైరల్ అవ్వుతూ ఉంటది. తాజాగా తాను గర్భవతి అయినట్లు.. పోస్ట్ చేయటం జరిగింది. ఇంస్టాగ్రామ్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి నా చిన్న లిటిల్ ఏంజెల్ కలవటానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ తాను గర్భవతిని అని.. ఇలియానా షాకింగ్ విషయానీ ప్రకటించడం జరిగింది. అయితే ఇలియానా పెళ్లి కాకుండానే గర్భవతి అని ప్రకటించటంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి