Dhaba style Butter chicken : ఇలా దాబా స్టైల్ లో బటర్ చికెన్ చేస్తే.. ఇంట్లో వాళ్ళు లొట్టలేయాల్సిందే…!

మనం బటన్ చికెన్ ఎలా చేయాలో చూడబోతున్నాం.. ఎంత బావుంటుంది అంటే నోట్లో వెన్నెల కరిగిపోతుందన్నమాట.. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేస్తే చేసుకోవడం చాలా చాలా ఈజీ ఏ రోజైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు గానీ లేదంటే ఏదైనా స్పెషల్ డేస్ లో గాని ఇంట్లో అదిరిపోయే ఒక డిలేషన్ డిష్ చాలా చాలా బాగుంటుంది.. దీన్నే ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…  దీనికి కావలసిన పదార్థాలు: బట్టర్, చికెన్, జీడిపప్పు, టమాటాలు, కొత్తిమీర, కసూరి మేతి, జిలకర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు మొదలైనవి…
తయారీ విధానం  300 నుంచి 400 గ్రాములు మధ్యలో బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, రెండు టీ స్పూన్ల దాకా కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని క్రష్ చేసుకుని వేసుకోండి. ఇందులోని ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి కూడా రసాన్ని పిండేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న చికెన్ ని కనీసం రెండు మూడు గంటలైనా డీప్రెజర్ లో మ్యారినేట్ చేసుకోవాలి. అలా అయితే చికెన్ అనేది చాలా టెండర్ గా ఉంటుందన్నమాట. స్టాప్ పై ఒక కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసేయండి.

మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ అంతా కూడా చక్కగా టెండర్ గా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ చికెన్ అంతా దగ్గరికి అయ్యేంతవరకు ఈ చికెన్ నుంచి ఫస్ట్ వాటర్ అనేది వచ్చి ఆ వాటర్ తోనే చికెన్ అంతా కూడా కుక్ అయిపోతుందన్నమాట. చికెన్ అనేది ఉడికిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ పీసెస్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి. మొత్తానికైతే చికెన్ ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట.. ఇలా చికెన్ చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం దమ్ చేసుకోవాలండి. దమ్ చేసుకుంటే ఆ ఫ్లేవరే డిఫరెంట్ గా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అనేది ఇలా ఫ్రై అయిపోయాక ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి కాల్చిన బొగ్గుని గాని లేదా కాల్చిన కొబ్బరి చిప్పని గాని లేదంటే పెద్ద యాలుకలు ఉంటాయి కదా బ్లాక్ ఖడ్గం ఉంటుంది కదండీ ఆ కాలిన బొగ్గు మీద వెన్న వేసి మూత పెట్టేసేయండి. లో ఫ్లేమ్ లో జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. ఈ స్మోక్ అంతా కూడా చికెన్ కి చక్కగా పట్టి తందూర్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట..తరువాత చేసుకున్న చికెన్ ని కూడా ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోండి.

బటర్ కరిగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు ఒక ఇంచ్ దాకా అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా తక్కువ ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయండి. ముక్కలుగా చేసుకుని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న వాటిని కూడా స్టవ్ ఆపేసేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్ లోకి తీసుకుని ఫైన్ పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ స్పూన్స్ దాకా బటర్ వేసుకోండి. బట్టర్ కరిగాక ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చేర్చుకుని వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం కూడా వేసేసి కారం మాడిపోకుండా జస్ట్ ఒకసారి కలుపుకున్న వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా.. ఈ బటర్ చికెన్ కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి ఈ పేస్ట్ అంతా కూడా బటర్ లో చక్కగా ఉడికేంతవరకు నిదానంగా ఫ్రై చేయండి.

తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా అందులో వేసి ఈ ప్లేస్ లో ఉండే పచ్చి వాసన అంతా పోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-10 మినిట్స్ పాటు కుక్ చేయండి. గ్రేవీ అనేది చిక్కబడి బటర్ అనేది పైకి తేలిన తర్వాత ఇందులోకి చివరగా కొద్దిగా క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసుకోండి. జస్ట్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది.. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి దింపుకోవడమే అంతే దాబా స్టైల్ బటర్ చికెన్ రెడీ.. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో వాళ్ళు లొట్టలు వేయాల్సిందే…

Recent Posts

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

47 minutes ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

2 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

3 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

4 hours ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

5 hours ago

Health Tips | వారు అస్స‌లు బొప్పాయి తిన‌కూడ‌దు.. తింటే మాత్రం…

Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…

6 hours ago

Banana peel Face Pack | అందానికి అరటిపండు తొక్క… సహజ మెరుపు కోసం ఇంట్లోనే బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇలా చేయండి!

Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…

7 hours ago

September | ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు ..సెప్టెంబర్లో పట్టిందల్లా బంగారం!

September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…

8 hours ago