Dental Health : కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన చాలామంది దానిని పట్టించుకోకుండా తాగుతూ ఉంటారు. కానీ ఇవి కంటికి కనిపించని అవయవాలకు మాత్రమే హాని కలిగిస్తాయి అని భావించటం సరైనది కానే కాదు. అయితే మన జీవిత కాలంలో టన్నుల కొద్ది ఆహారాన్ని నమ్మడంలో మనకు ఎంతో హెల్ప్ చేసే మన దంతలకు తీవ్ర నష్టం కలుగుతుంది అని చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఫ్యాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైన్స్ ద్వారా ప్రసిద్ధి చెందినటువంటి ఆర్ట్ కలెక్టర్ శాలిని పప్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాను ఎంతో ఇష్టపడే డ్రింక్స్ ను తాగుతూ తమ దంతాలను కాపాడుకోవడానికి ఒక కొత్త పద్ధతిని మొదలుపెట్టినట్లు చెప్పి యూజర్లలో ఆసక్తి లేపింది. అయితే షాంపెయిన్ స్ట్రా ద్వారా డ్రింక్స్ తాగడం వలన తమ సహజమైన దంతాలను కాపాడుకుంటున్నట్లు ఆమె తెలిపారు….
అలాగే తన స్నేహితులలో ఎంతోమంది ఎనామిల్ రక్షణ కోసం దంతాలపై అమర్చే ముఖ్య కవచాలు వీనీర్స్ ను కూడా వాడుతున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాక ఎక్కువ కాలం పాటు ఆమ్ల పానీయాలను తాగడం వలన దంతాల యొక్క ఎనామెల్ పోయే అవకాశం ఉంది అని అందుకే వీనీర్స్ ను అమర్చుతారు అని ఆమె తెలిపారు. కానీ ఆమె మాత్రం స్ట్రా వాడకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే ఆమ్ల పానియాలు సోడా లేక షాంపెయిన్ లాంటి డ్రింక్స్ ను తాగేటప్పుడు స్ట్రా వాడటం వల్ల ఎనామెల్ నష్టాన్ని తగ్గించవచ్చు అని వైద్యులు అంటున్నారు. అయితే ఈ డ్రింక్స్ అనేవి ఆమ్లత మరియు తక్కువ pH స్థాయిలను కలిగి ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో ఎనామెల్ ను దెబ్బతీస్తాయి అని డాక్టర్ బిభాకర్ రంజన్ అనే దంత వైద్యుడు చెప్పాడు…
అలాగే ఈ స్ట్రా ను ముందు దంతాలతో టచ్ చేయడం వలన ఎనామెల్ హానితో పాటు క్యావిటి రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది అని తెలిపారు. అలాగే కేవలం ఎనామెల్ రక్షణకు మాత్రమే కాక స్ట్రా తో తాగటం వలన ముందు భాగంలో ఉన్న దంతాల రంగు మారకుండా ఉంటుంది అని డాక్టర్ రంజన్ తెలిపారు. ఇది మెరిసే నవ్వుకు ఎంతో సహకరిస్తుంది అని తెలిపారు. మీరు ఇలా డ్రింక్స్ తాగడం వలన ముందు ఉన్నటువంటి దంతాలు రంగు మారకుండా ఉంటాయి అని డాక్టర్లు కూడా అంటున్నారు. ఇది కొంతలో కొంతైనా దంతాల సంరక్షణకు ఇది సరైన మరియు సమర్థవంతమైన మార్గం అని అంటున్నారు
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.