Hair Care Tips : జుట్టు రాలకుండా, ఒత్తుగా పెరగాలంటే.. తలస్నానం సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Hair Care Tips : జుట్టు రాలడం, పొడిబారడం లేదా నిర్జీవంగా మారడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీరు తలస్నానం చేసేటప్పుడు కొన్ని తెలియని పొరపాట్లు చేస్తుండవచ్చు. ముఖ్యంగా నూనె, చెమట, కాలుష్యం, హెయిర్ ప్రోడక్ట్స్ అవశేషాలు స్కాల్ప్‌పై (మాడుపై) పేరుకుపోవడం వల్ల జుట్టు మూలాలు దెబ్బతింటాయి. వీటిని పూర్తిగా తొలగించడానికి మీ అవసరాన్ని బట్టి మైల్డ్ ప్రీ-వాష్ ట్రీట్‌మెంట్ లేదా స్కాల్ప్ క్లెన్సింగ్ విధానాన్ని పాటించడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే, తలస్నానం చేశాక జుట్టుపై షాంపూ లేదా కండీషనర్ అవశేషాలు మిగిలిపోతే.. జుట్టు జిడ్డుగా, బరువుగా మారుతుంది. కాబట్టి, షాంపూ చేసుకున్న తర్వాత ఎక్కువ నీటితో జుట్టును శుభ్రంగా కడిగేయాలి.
Hair Care Tips : జుట్టు రాలకుండా, ఒత్తుగా పెరగాలంటే.. తలస్నానం సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Hair Care Tips తలస్నానం విషయంలో తరచుగా చేసే పొరపాట్లు ఇవే
రోజూ లేదా అవసరానికి మించి అతిగా తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తరచుగా హెయిర్ వాష్ చేయడం వల్ల కుదుళ్లలోని సహజ నూనెలు పూర్తిగా తొలగిపోయి, జుట్టు పొడిబారడం, ఫ్రిజ్‌గా మారడం, చివర్లు చిట్లిపోవడం (బ్రేకేజ్) వంటి సమస్యలు వస్తాయి. మీ జుట్టు స్వభావానికి ఏమాత్రం సరిపోని కఠినమైన షాంపూను ఉపయోగిస్తే జుట్టు మరింత రఫ్‌గా తయారవుతుంది. అందుకే, డ్రై లేదా డ్యామేజ్ అయిన జుట్టుకు తగినంత తేమను అందించే హైడ్రేటింగ్ షాంపూలను ఎంచుకోవడం ఉత్తమం.
Hair Care Tips తడిగా ఉన్నప్పుడు జుట్టుతో జాగ్రత్త.. హీట్ టూల్స్‌తో ముప్పు!
స్నానం చేసిన వెంటనే తడిగా ఉన్న జుట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా దువ్వకండి. జుట్టు తడిగా ఉన్నప్పుడు దాని కుదుళ్లు అత్యంత బలహీనంగా ఉంటాయి. ఆ సమయంలో బలంగా దువ్వడం లేదా చిక్కులు తీసేందుకు గట్టిగా లాగడం వల్ల జుట్టు సులభంగా రాలిపోయే ప్రమాదం ఉందని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. జుట్టు కాస్త ఆరిన తర్వాతే వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకోవాలి.
ఇక, జుట్టును స్టైలిష్‌గా మార్చుకునేందుకు వాడే స్ట్రెయిట్‌నర్లు, కర్లర్లు, బ్లో డ్రైయర్లను అతిగా ఉపయోగించడం వల్ల జుట్టులోని సహజమైన తేమ ఆవిరైపోయి బలహీనంగా మారుతుంది. వీటి వినియోగాన్ని సాధ్యమైనంత వరకు పరిమితం చేయాలి. ఒకవేళ ఫంక్షన్లు, పార్టీల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే మాత్రం, జుట్టు దెబ్బతినకుండా ముందుగా మంచి నాణ్యత కలిగిన ‘హీట్ ప్రొటెక్టెంట్’ సీరం లేదా స్ప్రేను జుట్టుకు అప్లై చేయడం మర్చిపోవద్దు.
