Ragi : ఇవి చిరుధాన్యం కాదు.. షుగర్ వ్యాధికి ఒక దివ్య ఔషధం...! ఈ విధంగా వినియోగిస్తే అనారోగ్య సమస్య ఉండదు...
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక చిరుధాన్యం రాగులు. పోషకాహార నిపుణులు చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోమని చెబుతున్నారు. అందులో రాగులు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వలన పుష్కలమైన ప్రయోజనాలు పొందుతారని అంటున్నారు. ఈ రాగుల్లో ఎన్నో లాభాలు కలిగించే పోషకాలు ఉన్నాయి. ఈ రాగుల్ని తినడం వల్ల ఎముకలు, జుట్టు, చర్మం, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. వీటిని మనము బ్రేక్ఫాస్ట్ సమయంలో తింటే రోజంతటికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇంకా మరెన్నో ఆనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.
Ragi : ఇవి చిరుధాన్యం కాదు.. షుగర్ వ్యాధికి ఒక దివ్య ఔషధం…! ఈ విధంగా వినియోగిస్తే అనారోగ్య సమస్య ఉండదు…
ఈ రాగులలో b1,b2,b6 మరియు kవిటమిన్లు,క్యాల్షియం,ఐరన్, పొలేట్, మాంగనీస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. రాగుల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఇలా చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. రాగుల్లో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ రాగులలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నాగుల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం తీరుతుంది. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఈ రాగులు ఎక్కువగా ప్రోటీన్లు ఉండడంవల్ల వ్యాయామాలు చేసే వారికి చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రాగుల్ని తినటం వలన కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో రాగులు సమర్ధంగా పనిచేస్తాయి. గుండె సంబంధించిన వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువగా ఉండి.. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉండేలా చేస్తాయి. కావున డయాబెటిస్ వారికి రాగులు ఒక వరమని అంటున్నారు.
రక్తహీనతతో బాధపడే వారికి ఇది ఒక మంచి ఆహారం. రక్తం వృద్ధి చెందుతుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు రాగుల్ని క్రమం తప్పకుండా తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి అని చెబుతున్నారు. రాగులతో తయారు చేసిన రొట్టెలు ఎముకల సాంద్రతను పెంచి, అది బలంగా మారటానికి దోహదపడతాయి. కొందరు రాగులని జావలాగా చేసుకొని తా వుతారు. రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, ఏ, బి,సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీంతో జీర్ణ శక్తి పెరుగుతుంది. రాగులను జావగా తాగడానికి ఇష్టపడని వారు, రాగులతో ఇడ్లీలు, దోశలు లాగా వేసుకుని కూడా తినవచ్చు. రాగులతో అంబలిని చేసుకొని తింటారు. ఈ రాగులతో పాటు జొన్నలు కూడా కలిపి తింటే ఇంకా చాలా మంచిది. షుగర్ వ్యాధి పూర్తిగా అరికట్టవచ్చు. తాగులను వివిధ రకాలుగా వినియోగించి రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
This website uses cookies.