Home » Health » Health Risks Of Binge Drinking Once A Week
Health

Sunday Alcohol : ఆదివారమే కదా అని ముందు తెగ తాగేస్తున్నారా ? .. అయితే ఈ నిజం తెలుసుకోండి.. లేకపోతే డేంజరే..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 22, 2026 5:56 pm
Advertisement

Alcohol : వారమంతా ఆఫీసు పనులతో బిజీగా గడిపి వీకెండ్ రాగానే ఫ్రెండ్స్‌తో పార్టీ ప్లాన్ చేయడం చాలామందికి అలవాటైపోయింది. “నేను రోజూ తాగను … వారానికి ఒక్కరోజే కదా… నాకేం కాదు” అని అనుకునే వారు కూడా చాలామంది ఉంటారు. కానీ నిపుణులు చెబుతున్నది వేరే కథ. రోజూ తాగకపోయినా ఒక్కరోజే అధికంగా మద్యం సేవించడం శరీరానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఈ అలవాటునే వైద్యులు “బింజ్ డ్రింకింగ్” అని పిలుస్తున్నారు. సరదాగా మొదలైన ఈ అలవాటు, క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదంగా మారుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి వారానికి సుమారు 60 మి.లీ. వరకు ఆల్కహాల్ తీసుకుంటే అది చాలా మందికి పరిమితి లోపలగా భావించవచ్చు. అయితే ఆ పరిమితిని దాటి పెగ్గుల మీద పెగ్గులు వేస్తే శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు కనిపించడం ప్రారంభమవుతుంది.

Advertisement

Sunday Alcohol : ఆదివారమే కదా అని ముందు తెగ తాగేస్తున్నారా ? .. అయితే ఈ నిజం తెలుసుకోండి.. లేకపోతే డేంజరే..!

Alcohol : బింజ్ డ్రింకింగ్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

వారమంతా మద్యం తాగకుండా ఒకే రోజు భారీగా మద్యం సేవించడాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. ఇది రోజూ కొద్దికొద్దిగా తాగడం కంటే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కారణం ఏమిటంటే, ఒకేసారి అధిక మోతాదులో ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లడం వల్ల అది నేరుగా రక్తంలో కలుస్తుంది. దీంతో మెదడు పనితీరు మందగిస్తుంది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల గుండె వేగం ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అవకాశముంది. కాలేయం (లివర్) పై కూడా భారీ ఒత్తిడి పడుతుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం, ఇన్‌ఫ్లమేషన్ రావడం తద్వారా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

Advertisement

Alcohol : శరీరంలో జరిగే అంతర్గత మార్పులు

మద్యంలో కేలరీలు అధికంగా ఉంటాయి. పార్టీ సమయంలో మద్యం తో పాటు జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ముఖ్యంగా పొట్ట, తొడల భాగంలో కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. ఇది మెటబాలిజంను నెమ్మదింపజేసి బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే మద్యం శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు (బీపీ) పెరగడం, గుండె స్పందనలో హెచ్చుతగ్గులు రావడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకేసారి అధికంగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు వచ్చే అవకాశముంది.

Alcohol : “ఒక్కరోజే కదా” అనుకునే ముందు ఆలోచించండి

వారానికి ఒక్కసారే కదా అని అతిగా తాగడం అంటే మీ ఆరోగ్యానికి మీరే రెడ్ సిగ్నల్ ఇవ్వడమే. మొదట సరదాగా అనిపించినా ఇది క్రమంగా అలవాటుగా మారి వ్యసనానికి దారితీస్తుంది. అదుపు కోల్పోయే పరిస్థితి వచ్చిన తర్వాత దాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. వినోదం కోసం తాగినా పరిమితి దాటకుండా జాగ్రత్త పడటం అత్యంత ముఖ్యం. శరీరాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఒక గ్లాస్ అదనంగా తాగేముందు దాని వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి