Home » Health » How Many Cups Of Black Coffee Do You Drink Every Day But You Definitely Need To Know This
Health

Black Coffee : ప్రతిరోజు మీరు బ్లాక్ కాఫీ ఎన్ని కప్పులు తాగుతున్నారు… అయితే, కచ్చితంగా ఇది తెలుసుకోవాలి…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 21, 2025 10:49 pm
Advertisement

Black Coffee : ప్రతిరోజు తాగే కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. టీ కన్నా కాఫీ ఆరోగ్యకరం.టీ ఆరోగ్యాన్ని పాడు చేస్తే, కాఫీ మాత్రం, ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే కాఫీ రోజు తాగితే మరణ ప్రమాదాలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. ఇటీవల అమెరికాలో టప్ట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, చేసిన పరిశోధనలో బ్లాక్ కాఫీ తాగితే,గుండె ఉండే జబ్బులు సహా ఇతర కారణాలతో వచ్చే మరణాల ప్రమాదం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ఒక కప్పు, రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగేవారికి,కాఫీ తాగని వారితో పోలిస్తే ఏ కారణంతో నైనా మరణించే,ప్రమాదం 14% తక్కువ ఉందని అధ్యయనంలో వెళ్లడైంది. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది. కాఫీలో చక్కర లేదా కొవ్వు పదార్థాలను ఎక్కువగా కలిపితే ఈ ప్రయోజనాలు తగ్గిపోతాయి. చక్కెర తక్కువగా కలిపినప్పుడు మరణ ప్రమాదం 14% తగ్గిందని అధ్యయన వివరాలు తెలియజేశాయి.

Advertisement

Black Coffee : ప్రతిరోజు మీరు బ్లాక్ కాఫీ ఎన్ని కప్పులు తాగుతున్నారు… అయితే, కచ్చితంగా ఇది తెలుసుకోవాలి…?

Black Coffee బ్లాక్ కాఫీ ఆరోగ్య ప్రయోజనాలు

సాధారణంగా కాఫీ ఆరోగ్యకరమే. కాఫీ కన్నా బ్లాక్ కాఫీ ఇంకా ఆరోగ్యం. కాఫీ తాగిన వారితో పోలిస్తే,ఏ కారణంతో నైనా మరణించే ప్రమాదం 14 శాతం తక్కువ ఉందని అధ్యయనంలో వెళ్లడయింది.ఇందులో ముఖ్యమైన విషయం, కాఫీలో చక్కెర లేదా కొవ్వు పదార్థాలు ఎక్కువగా కలిపితే ఈ ప్రయోజనాలు తగ్గిపోతాయి. చక్కెర తక్కువ కలిపినప్పుడు మరణ ప్రమాదం 14% తగ్గుతుందని అధ్యయన వివరాలు తెలియజేశారు. ఈ అధ్యనం కోసం అమెరికా, 1999 నుండి 2018 మధ్య జరిగిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES )ఎ డేటాను వాడారు. దానికి నేషనల్ డెత్ ఇండెక్స్ నుండి మరణాల వివరాలను కలిపి విశ్లేషించారు. అమెరికాలో సగం మందికి పైగా రోజు కనీసం ఒక కప్పు కాఫీ తాగుతున్నారు. కాబట్టి, ఇది ఆరోగ్యం పై ఎలా ప్రభావం చూపుతో తెలుసుకోవడం చాలా అవసరమని అధ్యయనానికి నాయకత్వం వహించిన వారు చెప్పారు.

Advertisement

కాఫీలో ఉండే జీవక్రియలో చురుకుగా ఉంటే పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు.చక్కెర సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా కలిపితే, కాఫీ వల్ల వచ్చే లాభాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. మరికొన్ని ముఖ్యమైన విషయాలు. రోజుకు కేవలం ఒక కప్పు కాఫీ తాగితే దానివల్ల ఏ కారణంతో నైనా మరణించే ప్రమాదం 16% తగ్గుతుందని తేలింది.రోజుకు రెండు నుంచి మూడు కప్పులు తాగే వారికి ప్రయోజనం 17% వరకు పెరిగింది.రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగితే అదనపు రక్షణ లభించలేదు. దీనికి విరుద్ధంగా ఎక్కువ కాఫీ తాగితే గుండె సంబంధిత మరణాల ప్రమాదం తగ్గటం అనే సంబంధం బలహీనపడింది.కాఫీ తాగితే క్యాన్సర్ కారణంగా మరణించే ప్రమాదం కూడా పెద్దగా సంబంధం లేదని కూడా అధ్యయనంలో వెల్లడించారు.మీరు రోజు బ్లాక్ కాఫీ తాగితే తక్కువ చెక్కరలతో పాటు కొవ్వు పదార్థాలు లేకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కానీ కొంచెం మోతాదులో ఉండేలా చూసుకోవాలి.బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుంటే దీర్ఘకాలికంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి