Ginger Garlic Paste : హైదరాబాదులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీ మొత్తంలో బయటపడింది. అయితే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఫెన్స్ అనే కాలనీలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లుగా గోడౌన్ పై కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ బెస్ట్ జోన్ అనే బృందం దాడి చేయడం జరిగింది. అయితే నిందితుడు ఇమ్రాన్ సలీం కల్తికి పాల్పడినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. అలాగే 835 కిలో లా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేసినట్లుగా పోలీసులు చెప్పారు.
అలాగే ఎయిర్ కండిషనర్ గ్రైండర్ మిషన్ తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసుకోవడానికి వాడే వస్తువులు కూడా సీజ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఆ వస్తువుల యొక్క విలువ సుమారుగా నాలుగు లక్షల కు పైనే ఉంటుంది అని పోలీసులు చెప్పారు. అయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఎక్స్పెరి డేట్ అయిపోయినటువంటి మరియు ఎటువంటి లేబుల్ అనేది లేకుండా హీనా బ్రాండ్ అనే పేరుతో కలిసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్టోర్స్ మరియు రెస్టారెంట్ మరియు హోటల్ కు నిందితుడు అమ్ముతున్నట్టు గుర్తించారు. అయితే గతంలో కూడా హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగోతం బయటకు వచ్చింది.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రామంతపూర్ లో 12 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పట్టుకున్నారు పోలీసులు. అలాగే నాంపల్లి లోను అగాపురాకు చెందినటువంటి మహమ్మద్ అనే ఒక వ్యక్తి రామాంతపూర్ లో ఐదు సంవత్సరాలుగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తు అధికారులు దొరికారు. అయితే ఇప్పుడు దొరికిన వ్యక్తికి ఇది మూడోసారి. అంతకుముందు ఇతడికి సాధారణ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం వలన బయటకు వచ్చి మళ్లీ అదే పని చేస్తున్నట్లుగా తెలిపారు పోలీసులు. ఇప్పుడు నాలుగోసారి దొరకడంతో మల్కాజ్ గిరి ఎస్ ఓ టి అతనిని అరెస్టు చేయడం జరిగింది. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారి మీద పీడీ యాక్ట్ నమోదు చేసి రౌడీ సీట్ ఓపెన్ చేయాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.