Liver : మీరు అధికంగా బయట ఫుడ్ ను తింటున్నారా. అయితే మీ శరీరంలోకి ఎన్నో వ్యాధులు తొందర్లోనే ప్రవేశించే అవకాశం ఉంది. వాటిలో ఒకటి కాలేయ సమస్య కూడా. అయితే మన జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు బిజీగా ఉండటం, శరీరాన్ని నిర్లక్ష్యం చేయటం, ఎక్కువగా తాగడం ఇవన్నీ కూడా మీ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసా. ముఖ్యంగా చెప్పాలంటే. మీ కాలేయం మీద ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అయితే ఇవన్నీ కూడా ప్యాటీ లివర్ మరియు లివర్ సిర్రోసిస్ లాంటి వ్యాధుల ప్రమాదాలను కూడా పెంచగలవు. అందుకే మీ కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. లేకుంటే చాలా ప్రమాదం. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
1. ట్రా న్స్ ఫ్యాట్లను నివారించండి : మన శరీరంలో కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు, కొవ్వులు సరైన సమతుల్యతను కలిగి ఉండడం ఎంతో అవసరం. అయితే రెస్టారెంట్ రెడ్ మీట్ మరియు అవుట్ డోర్ గ్రీల్స్ మరియు ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్, ఫుడ్ ను ఎక్కువగా తినడం వలన కూడా శరీరంలో ఫ్యాట్ స్థాయి అనేది ఎంతగానో పెరుగుతుంది. అలాగే ఈ కొవ్వు అనేది కాలేయానికి ఎంత మాత్రం మంచిది కాదు అని అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే కాలేయం చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వు కాలేయ పని తిరుపై కూడా ప్రభావం చూపిస్తుంది. అంతేకాక ఆహారం లో ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి…
2. రోజువారి ఆహారంలో చెక్కరను తగ్గించండి : ఎంతోమంది వ్యక్తులు స్లిమ్ గా ఉండడానికి వారు సొంత ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే చక్కెరను కూడా నివారించడానికి కృత్రిమ చక్కరపై ఆధారపడడం శరీరానికి ఎంతో ప్రమాదం. అంతేకాక అధిక చెక్కరను తీసుకునే అలవాటు ఉన్నటువంటి వారు వాళ్ళ కాలేయానికి విస్తృతమైన హాని అనేది కలుగుతుంది. అలాగే ప్రక్టోజ్ లేక కృత్రిమ చెక్కర కాలేయానికి ఎంతో ప్రమాదం…
3. పెయిన్ కిల్లర్స్ : పెయిన్ కిల్లర్ ను తీసుకోవడం గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వలన కాలేయం పై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాక టైలెనాల్ లేక కొలెస్ట్రాల్ మందులు కూడా కాలేయాన్ని ఎంతగానో దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఔషధం తీసుకునే ముందు వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి. అంతేకాక ఎంతో మంది ఇష్టం వచ్చినట్లుగా మందులను వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు…
4. తగినంత నీరు తాగండి : మీరు మీ శరీరం నుండి ఎంత ఎక్కువ టాక్సిన్స్ ను బయటకు పంపగలిగితే అంత మంచిది. అప్పుడే మీ కాలేయం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఎక్కువ నీరుని తీసుకోవటం మంచిది. అలాగే మూత్రంతో శరీరం నుండి ట్యాక్సీన్స్ ను బయటకు పంపిస్తాయి. వీలైతే ఆ నీటిని వేడి చేసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని రోజుకు కొన్ని సార్లు తీసుకోవాలి. అలాగే పెరుగు లాంటి ప్రొబయోటిక్ ఆహారాలను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది..
5. మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం : డిప్రెషన్ మరియు ఆందోళన శరీరంలోని కార్టీసాల్ హార్మోన్స్ ను పెంచగలవు. అలాగే ఈ హార్మోన్ కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. అంతేకాక ఎంతో మంది ఒత్తిడి లేక డిప్రెషన్ నుండి బయట పడడం కోసం తినడం లేక తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ పద్ధతి కూడా మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు. అలాగే మీ కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.