Home » Health » Shouldnt These Be Eaten On An Empty Stomach
Health

Empty Stomach : ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకూడదు? .. తిన్నారంటే? .. పెను ప్రమాదంలో పడినట్లే..!

Authored By
Suma
The Telugu News | Updated on: February 23, 2026 9:09 pm
Advertisement

Empty stomach :  ఉదయం నిద్ర లేవగానే ఏదో ఒకటి నోట్లో వేసుకుని కాలేజీ, ఆఫీసుల చేరుకోవడం యువతలో సాధారణ అలవాటు అయింది. కానీ రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపులో ఏది అయినా వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం. మన శరీరం రోజంతా ఎలా పనిచేయాలో నిర్ణయించే మొదటి ఆహారం కాబట్టి సరైనది, సరిగా టైమింగ్‌లో తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Empty Stomach : ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకూడదు? .. తిన్నారంటే? .. పెను ప్రమాదంలో పడినట్లే..!

Health : పరగడుపున తప్పించాల్సిన ఆహారాలు

సిట్రస్ ఫ్రూట్స్ .. జ్యూస్‌లు : నారింజ, బత్తాయి, నిమ్మ వంటి పండ్లు యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో ఇవి తాగితే అసిడిటీ, కడుపున మంట, హార్ట్‌బర్న్ సమస్యలు వస్తాయి.
కారం .. మసాలా ఫుడ్స్ : ఉదయాన్నే మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల కడుపునొప్పి, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్టమక్ ఉన్నవారికి ఇది మానదిగా ఉంటుంది.
కూల్ డ్రింక్స్ .. సోడాలు : మార్నింగ్‌లో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల కడుపులో గ్యాస్ పెరిగి ఉబ్బరం రావడం, డైజెస్టివ్ బ్యాలెన్స్ దెబ్బతినడం జరగుతుంది.
బెడ్ కాఫీ : పరగడుపున కాఫీ తాగడం శరీరంలో యాసిడ్ ఉత్పత్తిని పెంచి గ్యాస్, ఉబ్బరం, క్రమంగా కడుపు పొరను దెబ్బతీస్తుంది.
అతిగా అరటిపండ్లు .. స్వీట్స్ : ఖాళీ కడుపుతో అధిక అరటిపండ్లు తినడం, చాక్లెట్లు, కేక్స్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ మారి, ఆలస్యం, అలసట వస్తుంది.
పచ్చి కూరగాయలు : సలాడ్ రూపంలో పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచినైనా ఖాళీ కడుపులో తినడం వల్ల గ్యాస్, కడుపునొప్పి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Advertisement

Health : పరగడుపున తినాల్సిన ఆరోగ్యకర ఆహారాలు

గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు : నిద్రలేవగానే ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి తాగడం శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడమే కాక, డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.
ప్రోటీన్స్ .. గుడ్ ఫ్యాట్స్ : ఉడికించిన గుడ్లు, అవకాడో, బాదం, వాల్‌నట్స్ వంటి ఆహారాలు ఉదయాన్నే తినడం శరీరానికి ఎనర్జీని ఇస్తూ, మేధశక్తిని పెంచుతాయి.
హెల్తీ కార్బోహైడ్రేట్స్ : ఓట్స్, మిల్లెట్స్, హోల్ గ్రెయిన్ బ్రెడ్ వంటి ఆహారాలు నెమ్మదిగా అరిగి, రోజంతా శక్తిని అందిస్తాయి. షుగర్ లెవెల్స్ కూడా స్థిరంగా ఉంటాయి.

Health : ఫలితాలు .. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు

తేలికగా అరిగే ఫ్రూట్స్ : యాపిల్, బొప్పాయి వంటి పండ్లు పరగడుపున తింటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్ అందుతాయి.
గట్-ఫ్రెండ్లీ ఆహారాలు : ఇడ్లీ, దోశ, పెరుగు వంటి ఆహారాలు శరీరానికి సులభంగా జీర్ణమయ్యే విధంగా ఉంటాయి కడుపు నొప్పి సమస్యలు రాకుండా చేస్తాయి. నిరంతరం సరైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం రోజంతా తగిన తగిన ఎనర్జీ , మైండ్ ఫోకస్, జీర్ణక్రియ కోసం సిద్దమవుతుంది. కనుక ఉదయం నిద్రలేవగానే ఏ ఆహారం తినాలో జాగ్రత్తగా ఎంచుకోవడం ఆరోగ్యానికి కీలకం.

Advertisement

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి