Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే కాదు వాటిలో బిస్కెట్లు ముంచుకొని తినే అలవాటు ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా వీటినే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే పరిగడుపున చాయ్ బిస్కెట్ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ టీలో కెఫిన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే బిస్కెట్ లో చక్కెరతో పాటు కెఫిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వలన శరీరంలో కొవ్వు అనేది బాగా పెరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బిస్కెట్లలో ప్రాసెస్ చేసిన చక్కెరతో పాటుగా గోధుమ పిండి కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనిలో సంతృప్త కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. కావున ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. అంతేకాక బిస్కెట్ లో ఉండే పదార్థాలు అనేవి వేగంగా బరువు పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాక పొట్ట ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. ముఖ్యంగా వీటిని పరిగడుపున తీసుకోవడం వలన గ్యాస్ మరియు అసిడిటీ లాంటి సమస్యలకు దారి తీస్తాయి అని అంటున్నారు నిపుణులు. దీని వలన అజీర్ణం మరియు కడుపులో ఇబ్బందిగా ఉండటం లాంటి సమస్యలు వేధిస్తాయి అని అంటున్నారు.
మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉండే బిస్కెట్లను పరిగడుపున తీసుకుంటే అధిక రక్తపోటుకు దారితీస్తుంది అని అంటున్నారు. అలాగే వీటిని ప్రతి రోజు పరిగడుపున తీసుకుంటే గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాక ఈ బిస్కెట్లలో ఉండే సుక్రలోజ్ మరియు అస్పర్టమే జీవక్రియను నెమ్మది చేస్తుంది. ఇది జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకే ఛాయ్ తో పాటుగా బిస్కెట్లు తినడం అంత మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
Bigg Boss Telugu 8 : సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో…
This website uses cookies.