Categories: HealthNews

Women : శీతాకాలంలో స్త్రీలు ఈ 5 రకాల ఆహార పదార్థాలను తప్పక తినాల్సిందే…!

Women  : చలికాలం వచ్చిందంటే ఎన్నో అంటువ్యాధులు వస్తూ ఉంటాయి. సూర్య రష్మి తక్కువగా ఉండటం వలన శరీరంలో రోగనీరు శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ శీతాకాలంలో ఎక్కువగా స్త్రీల పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కావున చలికాలంలో ఎక్కువగా మహిళలు ఈ ఐదు రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. అయితే చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి,అలాగే శక్తిని, పౌష్టికాహారాన్ని తీసుకోవడానికి ఎంతో అవసరం. మహిళలు ముఖ్యంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని కూరగాయలు తినాలి. ఐదు రకాల కూరగాయలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…ఆ ఐదు రకాల కూరగాయలు ఏమిటో కూడా తెలుసుకుందాం….

Women : శీతాకాలంలో స్త్రీలు ఈ 5 రకాల ఆహార పదార్థాలను తప్పక తినాల్సిందే…!

Women  పాలకూర, బచ్చలి కూర

ఈ పాలకూరలో ఐరన్,క్యాల్షియం, విటమిన్ సి,పుష్కలంగా ఉన్నాయి. ఎముకలని నీ బలంగా ఉంచుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ల స్థాయిలను పెంచుతుంది. అయితే ఆయుర్వేద వైద్యుడు అయిన ‘నరేంద్ర కుమార్ ‘ స్థానిక 18కి తెలిపారు. బచ్చలి కూరను సూప్ ‘పరోటా లేదా కూరగాయల రూపంలో తీసుకోండి. చలికాలంలో ఇంటి పనులు కోసం పొద్దున్నే నిద్రలేచే స్త్రీలు బచ్చల కూర తీసుకోవాలి. వీలైనంతవరకు పాలకూర ఈరోజు వారి డేట్ ప్లాన్ లో చేర్చుకోవాలి. రెండు ఆకుకూరలను మహిళలు ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాలి. మహిళలకు ఐరన్ లోపం ఉంటుంది. తినడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. ఐరన్ లోపిస్తే మహిళలకు నీరసం,అలసట ఉంటుంది. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇంటి పనులు చక్కగా చేసుకోగలుగుతారు. ఎనర్జీ గా ఉండాలంటే ఈ ఆకుకూరలు రోజు తింటూ ఉండాలి.

Women  మెంతికూర

ఈ మెంతికూర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. శీతాకాలంలో ఉండే చలి నుంచి కూడా కాపాడుతుంది. మెంతికూర తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. కాలంలో మంచి ఔషధంగా చెప్పవచ్చు. జుట్టుకు కూడా మంచిది.స్త్రీలు జుట్టు పొడవుగా ఉండాలని, కొత్తగా బలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి సమస్యలు సమస్య ఎక్కువగా ఉన్నవారికి మెంతికూర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మెంతికూర తో మెంతి పరోటాలు, కూరగాయలు లేదా గరిటలు చేసి తినవచ్చు. ఆయుర్వేదంలో వైద్యుడు ‘నరేంద్ర కుమార్’ మాట్లాడుతూ కీళ్ల నొప్పులతో బాధపడే మహిళలు మెంతికూర తినొచ్చు అని చెప్పారు. అంతేకాకుండా మెంతికూర గరిటలు చేసే వృద్ధులకు ఇవ్వాలి. మెంతికూర లడ్డు నువ్వు ఒక నెలపాటు నిరంతరం తింటే కీళ్ల సమస్యలు నయమవుతాయి.

Women  క్యారెట్స్

క్యారెట్లు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్లు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అయితే ఈ క్యారెట్లలో విటమిన్ ఏ, ఏంటి ఆక్సిడెంట్లు ఉన్నాయని ఆయుర్వేద వైద్యుడు నరేంద్ర కుమార్ స్థానిక 18 కి తెలిపారు. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపుకి ఎంతో మేలు చేస్తుంది. ఈ క్యారెట్ చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఆడవారు అందంగా ఉండుటకు ఈ క్యారెట్స్ ఎక్కువగా తినాలి. నిరోధక శక్తిని పెంచుతుంది. మీరు సలాడ్ జ్యూస్ లేదా క్యారెట్ వంటకాలలో తయారు చేసుకొని తినవచ్చు. దీని మీరు రోజువారి డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి శక్తి లభిస్తుంది. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఇంట్లో పని చేసి అలసటికీ గురైనప్పుడు ఈ క్యారెట్ ని తప్పనిసరిగా తినండి. మీ అలసటను తగ్గించి నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు రోజు తింటే ఆరోగ్యంగా ఉంటారు.

చిలకడదుంప : చిలకడదుంపలు శీతాకాలంలో తింటే శరీరం వేడి చేస్తుంది. శరీరంలో చలికాలంలో వేడిని కోరుకుంటుంది. ఇటువంటి సమయంలో చిలకడదుంపల్ని తినొచ్చు. శరీర శక్తికి అద్భుతమైన మూలం. ఇందులో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియ, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని బాగా ఉడికించి లేదా కాల్చి తినవచ్చు. ఏ ఉడికించిన దానితో బెల్లం కలుపుకుని తింటే ఇంకా మంచిది.పీచు పదార్థం ఉండడం వలన షుగర్ వ్యాధిని కూడా అరికట్టవచ్చు. మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు. స్త్రీలు శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి దీన్ని ఎక్కువగా తీసుకోవాలి.

పచ్చి బఠానీలు : ఈ పచ్చి బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు సమతుల్యతలను కాపాడుటలో సహాయపడుతుంది. మరింత రుచికరంగా ఉంటాయి. దీన్ని పులావు,కూరగాయలు లేదా సూప్ లో చేర్చవచ్చు. వీటిని మహిళలు చలికాలంలో ఆహారంగా చేర్చుకోవడం వల్ల శరీరాన్ని వేడికి అందటమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago