Home » Horoscope » Lunar Eclipse Important Instructions For These Four Zodiac Signs
Horoscope

Lunar Eclipse 2026 : 2026లో తొలి చంద్రగ్రహణం .. ఈ నాలుగు రాశుల వారు తస్మాత్ జాగ్రత్త .. ?

Authored By
Suma
The Telugu News | Updated on: February 19, 2026 9:38 pm
Advertisement

Lunar Eclipse 2026 : 2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడనుంది. విశేషం ఏమిటంటే అదే రోజున హోలీ పండుగ కూడా ఉండటంతో ఈ గ్రహణం మరింత ఆసక్తికరంగా మారింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం సింహ రాశిలో సంభవించనుంది. చంద్రుడు సింహ రాశిలో సంచరిస్తున్న సమయంలో అదే రాశిలో కేతువు కూడా ఉండటం వలన ఈ రెండు గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను తీసుకురావచ్చని జ్యోతిష్యులు భావిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

Lunar Eclipse 2026 : 2026లో తొలి చంద్రగ్రహణం .. ఈ నాలుగు రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..

Lunar Eclipse 2026 : గ్రహణ సమయం .. జ్యోతిష్య ప్రాముఖ్యత

చంద్రగ్రహణం అనేది ఖగోళ పరంగా సహజ సంఘటన అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడు మనసుకు భావోద్వేగాలకు సూచికగా భావిస్తారు. కేతువు అనేది మోక్షకారక గ్రహంగా చెప్పబడుతుంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు మానసిక ఆందోళనలు, అనుకోని మార్పులు సంభవించే అవకాశముందని చెబుతున్నారు. సింహ రాశిలో ఈ గ్రహణం ఏర్పడటం వలన ఆ రాశికి అనుబంధంగా ఉన్న కొన్ని ఇతర రాశులపై కూడా దీని ప్రభావం ఉండొచ్చని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కుంభ, మీన, కర్కాటక, ధనస్సు రాశుల వారు ఈ కాలంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement

Lunar Eclipse 2026 : ఈ నాలుగు రాశుల వారికి సూచనలు

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలను వాయిదా వేయడం ఉత్తమం. ఎక్కువగా వాదనలు, తగాదాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే అనవసర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మీన రాశి : మీన రాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. ఖర్చులు పెరగడం, ఆదాయానికి మించిన బాధ్యతలు రావడం వలన ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు. కార్యాలయంలో పనిభారం అధికమవుతుంది. ఎంత కష్టపడ్డా తగిన ఫలితం రాకపోవడం నిరాశ కలిగించవచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆరోగ్యం, ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం

Advertisement

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ గ్రహణ కాలం ఆరోగ్య పరంగా కొంత సవాళ్లను తీసుకురావచ్చు. చిన్న అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాలి. మానసిక ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో అపార్థాలు, కలహాలు తలెత్తకుండా సహనంతో వ్యవహరించాలి.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు ముఖ్యంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని అవాంతరాలు లేదా ప్రమాదాల అవకాశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయరాదు. ఇంటి వాతావరణంలో కలహాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థన వంటి మార్గాలు అనుసరించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకోవాలి. ఇక ఈ చంద్రగ్రహణం ఖగోళ పరంగా సాధారణ సంఘటన అయినప్పటికీ జ్యోతిష్య పరంగా కొన్ని రాశుల వారికి సవాళ్లను సూచిస్తున్నదని చెబుతున్నారు. అయితే భయం అవసరం లేదు. అప్రమత్తంగా సమతుల్యంగా వ్యవహరిస్తే ప్రతికూల పరిస్థితులను సులభంగా అధిగమించవచ్చు.

 

 

Advertisement

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి