Uppal : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిపై పరమేశ్వర్‌రెడ్డి ఫోకస్.. కీలక పనులకు నిధుల విజ్ఞప్తి

Advertisement

Uppal  : ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా, మల్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డిని కోరారు. స్థానిక కాలనీవాసులతో కలిసి బుధవారం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన ఆయన, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ జోన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో అత్యవసర అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ పనులు పూర్తయితే రహదారి అనుసంధానం మెరుగుపడటంతో పాటు రోడ్డు భద్రత పెరుగుతుందని, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పరమేశ్వర్‌రెడ్డి వివరించారు. వినతిపత్రంపై ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Advertisement

Uppal : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిపై పరమేశ్వర్‌రెడ్డి ఫోకస్.. కీలక పనులకు నిధుల విజ్ఞప్తి

Uppal  కాప్రా డివిజన్‌లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు

కాప్రా డివిజన్‌లో పలు కీలక మౌలిక వసతుల పనులను చేపట్టాలని ప్రతిపాదించారు. అందులో గాంధీనగర్ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం, నాయక్‌నగర్–బంజారా కాలనీ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం, సాయిబాబా నగర్ ‘సి’ కాలనీలో కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఉన్నాయి. అదేవిధంగా సాయిబాబా నగర్ మసీదు రోడ్డు నుంచి డబుల్ బెడ్‌రూమ్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం, గాంధీనగర్ రేషన్ షాప్ నుంచి హెచ్.నెం. 1-1-159/4 నుంచి 1-1-160 వరకు సీసీ రోడ్డు వేయాలని కోరారు. వంపుగూడలో ఐఓబీ బ్యాంక్ లేన్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణం, వీఐపీ గోదాం నుంచి వంపుగూడ ప్రధాన రహదారి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కూడా ప్రతిపాదనల్లో చోటు దక్కించుకున్నాయి.యాదవ్ బస్తీ, కాప్రాలో సీసీ రోడ్డు నిర్మాణం, న్యూ గాంధీనగర్‌లో సీఎఏఎల్ పబ్లిక్ స్కూల్ లేన్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.అదనంగా సాయిబాబా నగర్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు, ఎల్లారెడ్డిగూడలో కల్వర్టు నిర్మాణం వంటి ప్రజలకు ఉపయోగపడే పనులను కూడా వెంటనే ప్రారంభించాలని కోరారు.

Advertisement

Uppal  మల్లాపూర్ డివిజన్‌లో కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ జిమ్‌కు ప్రతిపాదనలు

మల్లాపూర్ డివిజన్ పరిధిలో లక్ష్మీనగర్ కమ్యూనిటీ హాల్, న్యూ నరసింహ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని పరమేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే పిట్టల బస్తీలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందడంతో పాటు కాలనీల అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, కుషాయిగూడ డివిజన్ అధ్యక్షుడు కాకుంట్ల కౌకుట్ల ప్రకాష్‌రెడ్డి, కాప్రా డివిజన్ అధ్యక్షుడు శ్రీహరి, వంపుగూడ డివిజన్ అధ్యక్షుడు టిల్లు యాదవ్, జిల్లా కార్యదర్శి మారులి, మాజీ డివిజన్ అధ్యక్షుడు కోబారి నాగశేషు, నాగరాజు, మల్లాపూర్ డివిజన్ అధ్యక్షురాలు జెమిలా బేగం, మాజీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు నెమలి అనిల్, టిల్లు ముదిరాజ్, కాలనీవాసులు కబీర్ భాయ్, భూక్యా నాయక్, శేషాద్రి, లక్ష్మణ్, వేణు, నాగరాజు, మహేష్, సాయి కాలనీకి చెందిన పలువురు స్థానికులు పాల్గొన్నారు.

Advertisement
Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Recent Posts

Vijayasai Reddy Vs Subba Reddy : సాయిరెడ్డి vs సుబ్బా రెడ్డి .. జగన్ కి ఎవరి వల్ల ఉపయోగం ?

Vijayasai Reddy Vs Subba Reddy వైసీపీ మాజీ ఎంపీ, మాజీ ముఖ్య నేత వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా…

21 hours ago

Hanuman Nagar Colony : ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా 80వ‌ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Hanuman Nagar Colony : ఉప్పల్‌లోని హనుమాన్ నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహం, ఐక్యత…

22 hours ago

Vizag : వైజాగ్ బీచ్ లో అడుగు పెట్టాలి అంటేనే భయపడుతున్నారు.. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది..?

Vizag  : విశాఖ బీచ్ అంటేనే ఆహ్లాదం, అందం, ఆహ్లాదకరమైన సముద్ర గాలి గుర్తుకొస్తాయి. నీలిరంగు కెరటాలను చూస్తూ గంటల…

23 hours ago

Ys Jagan : జగన్ కి కేంద్రం బిగ్ షాక్..!

Ys Jagan  : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఢిల్లీ పర్యటన విషయంలో ఎదురుచూపులు తప్పడం…

1 day ago

Women’s : డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!

Women's  : ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఉద్యోగం లేదా సాధారణ…

1 day ago

Peanuts : వేపిన పల్లీలు vs పచ్చి వేరుశనగ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?

Peanuts  : వేరుశనగను చాలామంది సాధారణ స్నాక్‌గా చూస్తారు. కానీ ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్‌-E, మెగ్నీషియం,…

1 day ago

Pawan Kalyan : అక్కడ గెలిచి తీరాల్సిందే పవన్ కళ్యాణ్ పట్టుదల ..!

Pawan Kalyan : స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో…

2 days ago

Chiranjeevi Vs Rajinikanth : మరోసారి చిరంజీవి vs రజినీకాంత్..?

Chiranjeevi Vs Rajinikanth : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడం…

2 days ago

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అలిగారా..?

Pawan Kalyan  : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అలిగారా? సీఎం చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర…

2 days ago

Botsa Satyanarayana : బొత్స సత్యనారాయణ ఎందుకు భయపడుతున్నారు..!

Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి శాసనమండలి సమావేశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న…

2 days ago

Vishwanath And Sons Movie Review : విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Vishwanath And Sons Movie Review  : కుటుంబ కథలు, భావోద్వేగాలు, ప్రేమ, వినోదం కలగలిసిన సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడూ…

2 days ago

Karthika Deepam 2 Today Episode August 14th : మాలినిని ఓడించిన జ్యోత్స్న.. సూరజ్ పెళ్లికి నో!

Karthika Deepam 2 Today Episode August 14th : కార్తీక దీపం 2 ఆగస్టు 14 ఎపిసోడ్ 749:…

2 days ago