Home » Inspirational » Jharkhand Woman Farmer Success Story Earns Rs 70000 Per Year With Net House Tech
Inspirational

Woman Farmer Success Story : నెట్ హౌస్‌తో అద్భుతం: కొత్తిమీర సాగుతో రూ. 70 వేలు సంపాదిస్తున్న మహిళా రైతు!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 7, 2026, 10:20 am
Advertisement

Woman Farmer Success Story  : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కానీ, సరైన సాంకేతికత తోడైతే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు జార్ఖండ్‌కు చెందిన మహిళా రైతు బసంతి దేవి. ‘ఖేతీ రక్షక్ నెట్ హౌస్’ Kheyti Rakshak Net House అనే సాధారణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆమె ఆఫ్-సీజన్‌లో కొత్తిమీర పండిస్తూ ఏడాదికి రూ.70,000 ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

Advertisement

Jharkhand Woman Farmer Success Story : నెట్ హౌస్‌తో అద్భుతం: కొత్తిమీర సాగుతో రూ. 70 వేలు సంపాదిస్తున్న మహిళా రైతు!

Woman Farmer Success Story మట్టి ఇల్లు నుంచి పక్కా ఇల్లు వరకు..

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా గొలా గ్రామానికి చెందిన బసంతి దేవి జీవితం గత ఏడాది కాలంలో పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మట్టి ఇంట్లో నివసించిన ఆమె కుటుంబం, నేడు వ్యవసాయంలో వచ్చిన లాభాలతో ‘పక్కా ఇల్లు’ నిర్మించుకుంది. ఆమె పెద్ద కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. ఈ మార్పులన్నింటికీ కారణం ఆమె చేపట్టిన వినూత్న వ్యవసాయ విధానమే.

Advertisement

Woman Farmer Success Story  విఫలమైన ప్రయత్నాల నుంచి విజయ తీరాలకు..

సాధారణంగా కొత్తిమీర అక్టోబర్, నవంబర్ నెలల్లో బాగా పెరుగుతుంది. అయితే బసంతి దేవి వర్షాకాలంలో కూడా దీనిని పండించాలని గతంలో ప్రయత్నించారు. కానీ భారీ వర్షాల వల్ల పంట దెబ్బతినడం, విత్తనాల కోసం పెట్టిన పెట్టుబడి వృధా అవ్వడం జరిగేది. ఈ క్రమంలోనే ‘TRI’ Transform Rural India అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆమె ‘ఖేతీ’ Kheyti సంస్థ అభివృద్ధి చేసిన నెట్ హౌస్ టెక్నాలజీని తన 1.2 ఎకరాల పొలంలో ఏర్పాటు చేసుకుంది.

నెట్ హౌస్ ప్రత్యేకతలేంటి?

ఖేతీ రక్షక్ నెట్ హౌస్ అనేది ‘గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్’ Greenhouse-in-a-box మోడల్‌లో పనిచేస్తుంది. ఇది పంటలను రక్షిస్తుంది. బయటి ఉష్ణోగ్రత కంటే నెట్ హౌస్ లోపల 3 నుండి 5 డిగ్రీల తక్కువ వేడి ఉంటుంది. గంటకు 100 కి.మీ వేగంతో వీచే గాలులను, భారీ వర్షాలను ఇది తట్టుకుంటుంది. 90 శాతం వరకు పురుగుల ఉధృతిని తగ్గించి, పురుగుమందుల వాడకాన్ని తగ్గిస్తుంది.

Advertisement

ఆదాయం ఇలా..

గత ఏడాది కేవలం 3 కిలోల నాణ్యమైన కొత్తిమీర విత్తనాలతో (విలువ రూ. 900) బసంతి దేవి సాగు ప్రారంభించారు. అక్టోబర్ 2025లో మొదటి కోత కోయగా, మొత్తం సీజన్‌లో 8 సార్లు పంటను సేకరించారు. మొత్తం 85 కిలోల తాజా కొత్తిమీరను కిలో రూ.150 చొప్పున విక్రయించి మంచి లాభాలను గడించారు. కొత్తిమీరతో పాటు టొమాటో, బీన్స్, చిక్కుడు వంటి ఇతర కూరగాయలను కూడా ఆమె పండిస్తున్నారు.

“గతంలో నీటి ఎద్దడి లేదా పురుగుల సమస్య వేధించేది. కానీ ఇప్పుడు నెట్ హౌస్ వల్ల ఏడాది పొడవునా పంటలు పండించే ధైర్యం వచ్చింది,” అని బసంతి దేవి గర్వంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెను చూసి చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళా రైతులు కూడా ఈ స్మార్ట్ అగ్రికల్చర్ వైపు అడుగులు వేస్తున్నారు. వాతావరణ మార్పులను తట్టుకుని లాభసాటి వ్యవసాయం చేయాలనుకునే రైతులకు బసంతి దేవి ఒక గొప్ప స్ఫూర్తి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి