
Gurukul Jobs : గురుకులాల్లో 6 వేలకు పైగా ఖాళీలు.. ఇంకా 60 రోజుల సమయం ఉంది అప్లై చేసుకోండి..!
Gurukul Jobs : తెలంగాణలోని లోని SC, ST, BC, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో 6 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 1,800కు పైగా బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నట్లు అంచనా. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీతో పాటు వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను 2025-26 జాబ్ క్యాలెండర్‌లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. డీఎస్సీ, జేఎల్ నియామకాల తర్వాత మొత్తం ఖాళీలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ స్థాయి నుంచి కిందిస్థాయి వరకు భర్తీ చేయకపోవడం, ఒకేసారి నాలుగైదు కేటగిరీ పోస్టుల ఫలితాలు ఇవ్వడంతో కొందరు అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికయ్యారు. వారంతా ఏదేని ఒక పోస్టులో చేరుతూ మిగిలిన వాటిని వదులుకుంటున్నారు. గతంలో మాదిరి రీలింక్విష్‌మెంట్ సదుపాయం లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో కొత్తగా నియమితులైనవారికి గురుకుల సొసైటీలు పోస్టింగులు ఇచ్చాయి. అభ్యర్థులు ఆయా పోస్టుల్లో చేరేందుకు 60 రోజుల సమయం ఉంది. ఈ గడువు తర్వాత గురుకులాల్లో బ్యాక్‌లాగ్ పోస్టులపై మరింత స్పష్టత వస్తుందని సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Gurukul Jobs : గురుకులాల్లో 6 వేలకు పైగా ఖాళీలు.. ఇంకా 60 రోజుల సమయం ఉంది అప్లై చేసుకోండి..!
డీఎస్సీ, జేఎల్ పరీక్షల ఫలితాల అనంతరం గురుకులాల్లో మరో వెయ్యి నుంచి 2 వేల పోస్టులు ఖాళీ కానున్నట్లు సమాచారం. ఎస్సీ గురుకుల సొసైటీలో దాదాపు 1,800కు పైగా పోస్టులతో పాటు మిగిలిన సొసైటీల్లోనూ ఖాళీలు ఉన్నాయి. గతేడాది ఈ పోస్టులకు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు. ఈ పోస్టులన్నీ కలిపితే గురుకులాల్లో దాదాపు 6 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.