Home » Jobs Education » Anganwadi Jobs Rompicharla Icds Project
Jobs Education

Anganwadi Jobs : మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. అంగన్‌వాడీలో ఉద్యోగాలు.. ఈ నెల 21 ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 17, 2024, 8:00 am
Advertisement

Anganwadi Jobs : ఆంధ్ర‌ప్రదేశ్‌లోని ప‌ల్నాడు జిల్లా రొంపిచెర్ల, పులిచెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ నాగశైలజ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Anganwadi Jobs పోస్టుల‌ వివ‌రాలు :

– పులిచెర్ల మండలంలో ఆర్.కుమ్మరపల్లె, చెన్నుపాటివారిపల్లెలో మినీ అంగన్వాడీ కార్యకర్త
– కావేటిగారిపల్లెలో హెల్పర్
– రొంపిచెర్ల మండలంలోని బోడిపాటివారిపల్లెలో హెల్పర్ పోస్టులు

విద్యార్హ‌త :
– 10వ తరగతి ఉత్తీర్ణత

Advertisement

వ‌య‌స్సు :
21-35 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులు.
– అభ్యర్థులు స్థానికులై ఉండాలి.
– ఈ నెల 21వ తేదీ లోపు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆమె పేర్కొన్నారు.

అలాగే వలమనేరు ఐసీడీఎస్ పరిధిలోని గంగవరం, బందార్లపల్లె అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సీడీపీఓ ఇందిరా ప్రియదర్శిని ఓ ప్రకటనలో కోరారు. అభ్యర్థులు స్థానికులై ఉండాలని, ప దోతరగతి పాసై 21 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పుంగనూరు, సోమల మండలాల్లో.. పుంగనూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ రాజేశ్వరి ఒక ప్రకటనలో కోరారు.

Advertisement

Anganwadi Jobs : మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. అంగన్‌వాడీలో ఉద్యోగాలు.. ఈ నెల 21 ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

మండలంలోని రాంనగర్, ఆరడిగుంట, సోమల మండలంలోని ఫిరంగులగుట్ట, ముండ్రివా రిపల్లెలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈనెల 12 నుంచి 21వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తులు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వీ.కోట మండలం: మండలంలోని గాండ్లపల్లె, పాపేపల్లె అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకురాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ మాధవిలత ఓ ప్రకటనలో తెలిపారు. స్థానికులై ఉండాలని, పదవ తరగతి పాసైన 21 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు అర్హులని పేర్కొన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి