Home » Jobs Education » Ap Government To Fill 4687 Anganwadi Posts
Jobs Education

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 27, 2025 7:01 pm
Advertisement

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Advertisement

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : త్వరలో నోటిఫికేషన్

మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేసే విధానం రెండు దశల్లో అమలు చేయబడుతుంది. మొదటి దశలో అర్హత కలిగిన పదో తరగతి ఉత్తీర్ణులైన 4,687 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను నెలకు రూ.11,500 గౌరవ వేతనంతో ప్రధాన ఆంగన్‌వాడీ కార్యకర్తలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేయనుంది. అలాగే 4,687 మంది కొత్త సహాయకులను నెలకు రూ.7,000 గౌరవ వేతనంతో నియమించనుంది. పోస్టుల భ‌ర్తీకి త్వరలోనే నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది.

Advertisement

అర్హతలు : ఈ ఉద్యోగుల‌కు స్థానికంగా నివసించే వివాహిత మ‌హిళలు అర్హులు. అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త ఉద్యోగాల‌కు 10వ త‌ర‌గ‌తి. అంగ‌న్‌వాడీ స‌హాయ‌కురాలు ఉద్యోగానికి ఏడో త‌ర‌గ‌తి. క‌నీస వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు. గ‌రిష్ఠ వ‌య‌స్సు 35 సంవ‌త్స‌రాలు. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు కేటాయించిన పోస్టుల్లో 21 ఏళ్లు క‌లిగిన అభ్య‌ర్థి లేక‌పోతే 18 సంవ‌త్స‌రాలు నిండిన వారిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

ఎంపిక‌ : ఇంట‌ర్వ్యూ, మెరిట్ ఆధారంగా అంగన్‌వాడీల‌ను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అలాగే ద‌ర‌ఖాస్తు ఫీజు కూడా ఉండదు.

Advertisement

సర్టిఫికెట్ల అందజేత : అర్హత కలిగిన అభ్య‌ర్థులు స్వ‌యంగా వెళ్లి సంబంధిత ఐసీడీఎస్‌ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తులు అంద‌జేయాలి. బ‌యోడేటాతో పాటు అన్ని విద్యా అర్హ‌త, ఇత‌ర స‌ర్టిఫికెట్లు జిరాక్స్ కాపీల‌పై గెజిటెడ్ ఆఫీస‌ర్‌తో అటెస్టేష‌న్ చేయించాలి. అనంతరం సర్టిఫికెట్ల సెట్‌ను ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల‌యాల్లో అప్లికేష‌న్‌తో పాటు అందజేయాలి.

ఎంపిక విధానం : అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలోని కమిటీ చేపడుతుంది. ప‌దో త‌ర‌గ‌తి పాసైనందుకు 50 మార్కులు, ప్రీ స్కూల్ ట్రైనింగ్ పొందితే 5 మార్కులు, వితంతువుకు 5 మార్కులు, చిన్న‌పిల్ల‌ల‌తో కూడిన వితంతువుకు 5 మార్కులు, అనాథలుగా ఉండే అభ్య‌ర్థికి 10 మార్కులు, దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు 5 మార్కులు, ఇంట‌ర్వ్యూకు 20 మార్కులు.. మొత్తం 100 మార్కులు ఉంటాయి. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా అంగన్‌వాడీల ఎంపిక ఉంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి