Home » Jobs Education » Bel Recruitment 2024 Latest 11 Vacancies August 2024
Jobs Education

BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. జీతం 55,000..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 22, 2024 11:21 am
Advertisement

BEL Recruitment : BELలో కెరీర్‌ దేశంలో అత్యంత సురక్షితమైన మరియు ఆశాజనకమైన ఉద్యోగాలలో ఒకటి. అధిక స్థాయి ఉద్యోగ భద్రత, మంచి జీతం & ఉత్తేజకరమైన కెరీర్ మరియు వృద్ధి అవకాశాల కారణంగా BEL ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ వివిధ ఖాళీల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి అప్రెంటిస్‌తో సహా నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 11 ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి బెల్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 23 దరఖాస్తుకు చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://bel-india.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Advertisement

అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో బీఈ /బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ /ఐటీ / సైబర్ సెక్యూరిటీ / కంప్యూటర్ నెట్‌వర్కింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం : నెలకు రూ.40,000- రూ.55,000 ఉంటుంది.

Advertisement

వయోపరిమితి : 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్ల‌ సడలింపు ఉంటుంది.

పని ప్రదేశం : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘజియాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

Advertisement

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో

దరఖాస్తు ఫీజు : జనరల్ రూ.472, ఎస్సీ /ఎస్టీ /పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. జీతం 55,000..!

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

Advertisement

దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 23, 2024

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి