Home » Jobs Education » Gds Posts For Grameen Dog Seva
Jobs Education

Indian Postal GDS recruitment 2026 : 10వ తరగతి పాస్ అయితే చాలు .. రాత పరీక్ష లేకుండానే గ్రామీణ డాగ్ సేవక్ పోస్టులు .. పూర్తి వివరాలివే..!

Authored By
Suma
The Telugu News | Updated on: February 17, 2026 9:36 am
Advertisement

Indian Postal GDS recruitment 2026 : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ GDS పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. India Post ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భారీ నియామక ప్రక్రియకు ఫిబ్రవరి 14 చివరి తేదీగా నిర్ణయించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నా ఇంకా అప్లికేషన్ సమర్పించని అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు తమ దరఖాస్తును పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/gdsonlineengagement ను సందర్శించి ఆలస్యం చేయకుండా అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

GDS posts for Grameen Dog Seva

Indian Postal GDS recruitment 2026 : అర్హతలు, వయోపరిమితి వివరాలు

ఈ నియామక ప్రక్రియలో భాగంగా అప్లై చేయదలచిన అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో గణితం మరియు ఆంగ్లం సబ్జెక్టులు పాస్ అయి ఉండటం అవసరం. అలాగే అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. సంబంధిత రాష్ట్ర భాషను చదవడం, రాయడం వచ్చి ఉండాలి. తెలుగు రాష్ట్రాలకు దరఖాస్తు చేసే వారు తెలుగు భాషపై పట్టు కలిగి ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తై ఉండాలి. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు మించకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు మరియు ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అదనంగా అభ్యర్థులకు సైకిల్ తొక్కడం వచ్చి ఉండటం కూడా తప్పనిసరి అర్హతగా పేర్కొన్నారు.

Advertisement

Indian Postal GDS recruitment 2026 : ఫీజులు, జీతభత్యాలు మరియు ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.100/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,740 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జీతభత్యాల విషయానికి వస్తే, బ్రాంచ్ పోస్టుమాస్టర్ BPM పోస్టుకు నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు వేతనం ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ ABPM మరియు గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు జీతం అందజేస్తారు. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధం చేసి ఎంపిక చేస్తారు. ఎలాంటి రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.

Indian Postal GDS recruitment 2026 : ఎడిట్ అవకాశం, ముఖ్య సూచనలు

దరఖాస్తు సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగినట్లయితే సవరించుకునే అవకాశం కూడా కల్పించారు. ఫిబ్రవరి 18 మరియు 19, 2026 తేదీల్లో ఎడిటింగ్ విండోను తెరవనున్నారు. ఆ రోజుల్లో అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు సమాచారం ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా అందజేస్తారు. కాబట్టి దరఖాస్తు సమయంలో సరైన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇవ్వడం అత్యంత ముఖ్యము. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే అప్లై చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి