Jobs : 10 వ తరగతి పాస్ అయినా వారికీ మహిళలకు జాబ్స్ ఎక్కడంటే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jobs : 10 వ తరగతి పాస్ అయినా వారికీ మహిళలకు జాబ్స్ ఎక్కడంటే..!!

 Authored By ramu | The Telugu News | Updated on :5 June 2025,6:10 pm

ప్రధానాంశాలు:

  •  Jobs : 10 వ తరగతి పాస్ అయినా వారికీ మహిళలకు జాబ్స్ ఎక్కడంటే..!!

Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహిళా నిరుద్యోగులకు ఓ మంచి అవకాశం దక్కనుంది. ఈ నెల జూన్ 6వ తేదీన హనుమకొండలోని ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Jobs 10 వ తరగతి పాస్ అయినా వారికీ మహిళలకు జాబ్స్ ఎక్కడంటే

Jobs : 10 వ తరగతి పాస్ అయినా వారికీ మహిళలకు జాబ్స్ ఎక్కడంటే..!!

Jobs : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జూన్ 6న మహిళల కోసం ప్రత్యేక జాబ్ మేళా

ఈ జాబ్ మేళాలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి (LIC) ఖాళీగా ఉన్న ఏజెంట్ పోస్టుల భర్తీ చేయనుంది. పదవ తరగతి పాసైన 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు పూర్తి కాలం (ఫుల్ టైం) లేదా పాక్షిక కాలం (పార్ట్ టైం) ఏజెంట్లుగా పనిచేసే అవకాశముంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూల ద్వారా నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7000 స్టైఫండ్‌తో పాటు బోనస్ కూడా అందనుంది.

ఇందులో పాల్గొనదలచిన అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు (జిరాక్స్ కాపీలు), ఆధార్ కార్డు, బయోడేటా, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు సిద్ధం చేసుకోవాలి. ఈ జాబ్ మేళా జూన్ 6వ తేదీ ఉదయం 11 గంటలకు వరంగల్ నగరంలోని ములుగు రోడ్‌ వద్ద గల ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 78933 94393 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. మహిళా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు.

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి