Home » Jobs Education » Mini Job Mela At Miracle College On This 18th
Jobs Education

Job Mela : మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా.. జీతం రూ.3.50 ల‌క్ష‌లు

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: September 17, 2024 11:12 pm
Advertisement

Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదో తరగతి మొదలుకుని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అవకాశాలు కల్పిస్తుంది.

Advertisement

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ కొన్ని వేల‌ మందికి ప్ర‌భుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగానే నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం సమీపంలో గల మిరాకిల్ కళాశాలలో ఈ నెల 18న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వెల్ల‌డించారు. ఈ జాబ్ మేళాలో హెటెరో ఫార్మా, అపోలో ఫార్మా, శ్రీరామ్ గ్రూప్, డెక్కన్ కెమికల్, బొల్లినేని హోమ్ ఫ్రంట్, వరుణ్ మోటార్స్, మొత్తుట్ అరబిందో ఫార్మా పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఏదైనా పూర్తి చేసి, 18 నుంచి 30 ఏండ్ల లోపు వారు అర్హులు.

Job Mela : మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా.. జీతం రూ.3.50 ల‌క్ష‌లు

Advertisement

ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి జీతం రూ.10 వేల‌ నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అభ్య‌ర్థులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్ పోర్టు సైజు ఫొటో తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి క‌ల్ప‌నాధికారి కోరారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి