Home » National » Donald Trump As Jesus
National

Donald Trump : ఒరేయ్ ఏంది రా ఇది .. ఏసుక్రీస్తు గా డొనాల్డ్ ట్రంప్

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Updated on: April 13, 2026, 8:05 pm
Advertisement

Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత అవతారమెత్తి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశారు. కెథలిక్ చర్చి మరియు వాటికన్ సిటీతో ఆయనకు ఉన్న విభేదాలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇటీవల పోప్ లియోపై విమర్శలు గుప్పించిన ట్రంప్, అంతటితో ఆగకుండా తనను తాను సాక్షాత్తూ ఏసుక్రీస్తులా చిత్రీకరించుకుంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన సామాన్య జనం నుండి రాజకీయ విశ్లేషకుల వరకు అందరూ ఒరేయ్ ఏంది రా ఇది అని ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Donald Trump : ఒరేయ్ ఏంది రా ఇది .. ఏసుక్రీస్తు గా డొనాల్డ్ ట్రంప్..!

Donald Trump : వ్యాటికన్ సిటీపై యుద్ధం

ట్రంప్ గత కొంతకాలంగా మతపరమైన అంశాలను తన రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారు. అయితే ఈసారి ఆయన నేరుగా వాటికన్ సిటీ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పోప్ తీరును తప్పుబడుతూ, క్రైస్తవ మతానికి అసలైన రక్షకుడిని తానే అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. ఈ క్రమంలోనే ఏసుక్రీస్తు బైబిల్‌లో లాజరస్‌ను మరణం నుండి బ్రతికించిన అద్భుతాన్ని పోలి ఉండేలా తన ఫోటోను తయారు చేయించుకున్నారు. ఈ చర్య ద్వారా తను కేవలం నాయకుడిని మాత్రమే కాదు, ఒక అతీంద్రియ శక్తి కలిగిన వ్యక్తిని అని చెప్పుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

Donald Trump : ఆ ఫోటోలో ఏముందంటే

ఆ వివాదాస్పద ఫోటోలో ట్రంప్ పొడవైన తెల్లని వస్త్రాలు, భుజంపై ఎర్రటి కండువా ధరించి అచ్చం జీసస్ లా కనిపిస్తున్నారు. ఆయన ఎడమ చేతిలో ఒక ప్రకాశవంతమైన వస్తువు ఉంది, దాని నుండి వెలువడుతున్న వెలుగు కిరణాలు కింద పడి ఉన్న ఒక వ్యక్తికి ప్రాణం పోస్తున్నట్లు లేదా స్వస్థత చేకూరుస్తున్నట్లు ఆ చిత్రం ఉంది. చుట్టూ ఉన్న ప్రజలు భక్తితో, ఆశ్చర్యంతో ఆయన్ని చూస్తుండటం గమనార్హం. ఇది చూస్తుంటే ఒక అపర జీసస్ లా తనను తాను మార్కెటింగ్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

Donald Trump : మండిపడుతున్న కెథలిక్ వర్గాలు

ట్రంప్ చేసిన ఈ పని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కెథలిక్ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. పవిత్రమైన ఏసుక్రీస్తు రూపంతో ఒక రాజకీయ నాయకుడు తనను తాను పోల్చుకోవడం అపచారమని వారు మండిపడుతున్నారు. ఓట్ల కోసం ఇంతలా దిగజారాలా అని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల వేళ మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి, తన వైపు తిప్పుకోవాలనే ట్రంప్ వ్యూహం ఈసారి వికటించేలా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ జీసస్ అవతారం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను తుఫానును సృష్టిస్తోంది.

Advertisement

 

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి