Home » National » Donald Trump Venezuela Biggest Oil Deal History
National

Donald Trump : ఆ దేశాన్ని వంద ఏళ్ళు దోచుకునేలా .. ట్రంప్ మాస్టర్ ప్లాన్..!

Donald Trump ప్రపంచ గతిని నిర్దేశించే అత్యంత కీలకమైన అంశాలలో 'చమురు' (Oil) దే అగ్రస్థానం. ఈ నిజాన్ని మరోసారి రుజువు చేస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అసాధారణమైన భౌగోళిక రాజకీయ
Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 30, 2026 12:17 am
Advertisement

Donald Trump : ప్రపంచ గతిని నిర్దేశించే అత్యంత కీలకమైన అంశాలలో ‘చమురు’ (Oil) దే అగ్రస్థానం. ఈ నిజాన్ని మరోసారి రుజువు చేస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అసాధారణమైన భౌగోళిక రాజకీయ వ్యూహానికి తెరతీశారు. ఏకంగా ఒక దేశాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుని, తనకు అనుకూలమైన వ్యక్తిని ఆ దేశాధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారు. ఆ దేశమే ‘వెనెజులా’ (Venezuela). ట్రంప్ తన వ్యూహంతో వెనెజులా పగ్గాలను డెల్సీ రోడ్రిగ్స్ చేతికి అప్పగించారు. ఆ తర్వాత అదే అధ్యక్షురాలితో ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద చమురు ఒప్పందాన్ని కుదుర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

Advertisement

Donald Trump : ఆ దేశాన్ని వంద ఏళ్ళు దోచుకునేలా .. ట్రంప్ మాస్టర్ ప్లాన్..!

Donald Trump ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని చమురు ఒప్పందం

వెనెజులా గడ్డ కింద ఇప్పటివరకూ బయటకు తీయని అపారమైన ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలను వెలికితీసి, అత్యంత తక్కువ ధరకు అమెరికాకు తరలించుకుపోయే భారీ మాస్టర్ ప్లాన్‌ను ట్రంప్ అమలు చేశారు. ఈ మేరకు వెనెజులా ప్రభుత్వంతో అమెరికా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుందని, దీని ద్వారా ఆ దేశంలోని అపార చమురు నిల్వలను అమెరికా కొనుగోలు చేస్తుందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు డీల్ అని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించడం విశేషం. మరోవైపు, వెనెజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రభుత్వం కూడా ఈ మెగా డీల్‌ను అధికారికంగా ధృవీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా దాదాపు 65 బిలియన్ బ్యారెళ్ల నిరూపిత చమురు సామర్థ్యం గల 17 భారీ క్షేత్రాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ చారిత్రక ఒప్పందం ద్వారా వెనెజులా చమురు పరిశ్రమలోకి ఏకంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని, దీనివల్ల కారకాస్‌ (వెనెజులా రాజధాని) కు 209 బిలియన్ డాలర్లకు పైగా పన్నుల ఆదాయం సమకూరుతుందని రోడ్రిగ్స్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement

100 ఏళ్ల పాటు రహస్య ఆపరేటర్ చేతికి వెనెజులా ఆయిల్!

ఈ తాజా ఒప్పందం ప్రకారం, అమెరికా మరియు వెనెజులా ప్రభుత్వాలు కలిసి ఒక ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. ఈ సంస్థ ద్వారా చమురు వెలికితీత బాధ్యతలను ఒక రహస్య ప్రైవేట్ ఆపరేటర్‌కు అప్పగించనున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి సదరు రహస్య కంపెనీకి రోడ్రిగ్స్ ప్రభుత్వం ఏకంగా 100 సంవత్సరాల పాటు హక్కులను మంజూరు చేసింది. వాస్తవానికి, ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనెజులా. అమెరికా అధికారిక అంచనాల ప్రకారం.. వెనెజులాలో ఏకంగా 303 బిలియన్ బ్యారెళ్ల ముడి చమురు (Crude oil) నిల్వలు ఉన్నాయి. అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం చమురు నిల్వల్లో ఇది 17 శాతం. కానీ, ఆధునిక సాంకేతికత లోపించడం, ఇతర కారణాల వల్ల ఈ నిల్వలను సరిగ్గా వెలికితీయలేకపోవడం చేత ప్రపంచానికి వెనెజులా అందిస్తున్న చమురు కేవలం 1 శాతం మాత్రమే. ఇప్పుడు సరిగ్గా ఈ పాయింట్‌నే క్యాష్ చేసుకున్న అమెరికా.. ఆ అపార నిల్వలను వెలికితీసి తక్కువ ధరకే కొల్లగొట్టేందుకు పావులు కదిపింది. మొత్తం 303 బిలియన్ బ్యారెళ్ల నిల్వలకు గానూ, 65 బిలియన్ బ్యారెళ్లను తవ్వుకుపోయేందుకు ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుని అమెరికా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి