Home » National » H1b Visa Fee Hike Grace Period Scrapped Donald Trump Us Immigration Rules
National

Donald Trump : అన్ని దారులూ క్లోజ్ .. భారతీయులపై ట్రంప్ భారీ పిడుగు..!

Donald Trump అమెరికాలో కొలువు సాధించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కలలు కనే భారతీయ ఐటీ నిపుణులు, టెక్కీలకు ఊహించని షాక్ తగిలింది. హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ డొనాల్డ్ ట్రంప్
Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 29, 2026 4:27 pm
Advertisement

Donald Trump : అమెరికాలో కొలువు సాధించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కలలు కనే భారతీయ ఐటీ నిపుణులు, టెక్కీలకు ఊహించని షాక్ తగిలింది. హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సరికొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా నూతన హెచ్-1బీ వీసా రుసుమును రికార్డు స్థాయిలో పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లక్ష డాలర్ల వరకు ఉన్న ఈ ఫీజును శాశ్వత ప్రాతిపదికన మరింత పెంచాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిర్ణయించింది.

Advertisement

Donald Trump : అన్ని దారులూ క్లోజ్ .. భారతీయులపై ట్రంప్ భారీ పిడుగు..!

Donald Trump భారీగా పెరగనున్న H-1B వీసా ఫీజు: భారతీయ టెక్కీలకు పెనుభారం

హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూపొందించిన తాజా ముసాయిదా ప్రకారం, ఇకపై ఒక్కో హెచ్-1బీ వీసా ఫీజును 1,03,265 డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో దీని విలువ దాదాపు 86.80 లక్షల రూపాయలు. ఈ రుసుమును శాశ్వతంగా అమలు చేయాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన ముసాయిదాను వైట్‌హౌస్‌కు సమర్పించారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికన్ కంపెనీలకు విదేశీ ఉద్యోగుల నియామక ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఫలితంగా భారతీయ టెక్కీలకు యూఎస్ సంస్థల్లో అవకాశాలు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.

Advertisement

60 రోజుల గ్రేస్ పీరియడ్‌ రద్దు ప్రతిపాదన.. ఉద్యోగం పోతే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందే!

కేవలం వీసా ఫీజు పెంపుతోనే సరిపెట్టకుండా, ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులకు ఇచ్చే 60 రోజుల వెసులుబాటును (గ్రేస్ పీరియడ్) కూడా రద్దు చేయాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన సమగ్ర విధివిధానాలను ఇప్పటికే ఖరారు చేయగా, వైట్‌హౌస్‌కు చెందిన ‘ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్’ (OIRA) దీనిని సమీక్షించి ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ మార్పులను అధికారిక గెజిట్‌లో ప్రచురించేందుకు మార్గం సుగమమైంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యాక ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

ప్రస్తుత యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం, హెచ్-1బీ ఉద్యోగి తన కొలువు కోల్పోతే వేరొక కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా ఇతర చట్టబద్ధమైన వీసా కేటగిరీకి మారడానికి రెండు నెలల (60 రోజుల) వ్యవధి లభిస్తుంది. అయితే ఈ ప్రతిపాదన కనుక అమల్లోకి వస్తే, ఉద్యోగం పోయిన వెంటనే హెచ్-1బీ హోల్డర్లు అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ విభాగం తన విచక్షణాధికారాలతో ఇచ్చే ప్రత్యేక మినహాయింపులు మినహా, అక్కడే కొనసాగేందుకు ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోతాయి. దీంతో యూఎస్‌లోని లక్షలాది మంది భారతీయ టెక్కీల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి