
Jupalli Ramu Rao : యువత ప్రతిభే దేశ బలం.. TV9 WITT సమ్మిట్‌లో జూపల్లి రాము రావు... ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
Jupalli Ramu Rao : న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT) 2026’ సమ్మిట్‌లో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు ప్రసంగం అందరినీ ఆకర్షితులను చేసింది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాము రావు జూపల్లి మాట్లాడుతూ.. భారత మానవ వనరుల శక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం “పాలీ క్రైసిస్” వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం స్థిరంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశ యువతపై ప్రపంచానికి పెరుగుతున్న నమ్మకం, ప్రజాస్వామ్యం, జనాభా శక్తి, వైవిధ్యం వంటి అంశాలు భారత బలాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ సుమారు 7 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతూ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, యువతకు అందుతున్న అవకాశాలు దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చెప్పారు.
Jupalli Ramu Rao : యువత ప్రతిభే దేశ బలం.. TV9 WITT సమ్మిట్‌లో జూపల్లి రాము రావు… ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
1.యువ జనాభా
2.ఆంగ్ల భాషపై పట్టు
3.STEM రంగాల్లో ప్రతిభ
4.డిజిటల్ సామర్థ్యం & డేటా వినియోగం
5.అంతర్జాతీయ అంశాలపై బలమైన అవగాహన
6.సాంకేతికతను త్వరగా అలవాటు చేసుకునే నైపుణ్యం
7. సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్థ్యం
ఈ అన్ని అంశాలు కలిసి భారత్‌ను గ్లోబల్ టాలెంట్ హబ్‌గా నిలబెడుతున్నాయని జూపల్లి రాము రావు స్పష్టం చేశారు. దేశంలో అగ్రగామి న్యూస్ నెట్‌వర్క్ అయిన TV9 నిర్వహించిన ఈ గ్లోబల్ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పాలన, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలు వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన కీలక ప్రసంగంలో భారత్ గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న ప్రభావాన్ని ప్రస్తావించారు. గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ దృష్టిలో భారత్ స్థానం మారిందని, టెక్నాలజీ వినియోగదారుడి నుంచి ఉత్పత్తిదారుగా ఎదిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియా సంక్షోభంపై TV9 నెట్‌వర్క్ కవరేజ్‌ను అభినందించారు. అలాగే, పాలసీ, వ్యాపారం, టెక్నాలజీ రంగాల ప్రముఖులతో భారత్ గ్లోబల్ ప్రయాణం, ఎదుగుదలపై ఈ సమ్మిట్ చర్చలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు.
Ravi Babu Razor Movie Review : రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కెమెరా యాంగిల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే…
TVK, DMK AIADMK : తమిళనాడు రాజకీయ చరిత్ర ఎప్పుడూ రెండు ధ్రువాల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి కరుణానిధి వారసత్వంగా…
Rice vs Chapati : మన దైనందిన జీవితంలో శక్తినిచ్చే ప్రధాన వనరులు కార్బోహైడ్రేట్లు. ఇవి అన్నం మరియు చపాతీ…
Headless Hen : సాధారణంగా ఏ జీవికైనా తల తెగిపోతే కొన్ని సెకన్లలోనో లేదా నిమిషాల్లోనో ప్రాణాలు పోతాయి. గిలగిల…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ, ఐపీఎల్ 2026లో గురువారం…
Green Tea : నేటి ఆధునిక జీవనశైలిలో 'హెల్త్ ఈజ్ వెల్త్' అనేది కేవలం సామెత మాత్రమే కాదు, అందరి…
Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…
Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…
Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
This website uses cookies.