Home » National » Notification Released For Government Jobs In Iiitr
National

Government Jobs : సూపర్‌ ఛాన్స్‌ .. ఏదైనా డిగ్రీ అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలు ..రూ.55,000 నెల జీతం..!

Authored By
Suma
The Telugu News | Updated on: February 2, 2026 1:30 pm
Advertisement

Government Jobs  : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాంచీ IIITR ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ Central Government Educational Institution. ఈ సంస్థలో 2026 సంవత్సరానికి గాను పలు నాన్–టీచింగ్ (బోధనేతర) పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 19 ఖాళీలు ఉండగా ఇవన్నీ పర్మనెంట్ పోస్టులు కావడం విశేషం. టెన్త్, ఐటీఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Advertisement

Government Jobs : సూపర్‌ ఛాన్స్‌ .. ఏదైనా డిగ్రీ అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలు ..రూ.55,000 నెల జీతం..!

Government jobs  : ఖాళీల వివరాలు.. ముఖ్య సమాచారం

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ (CSE/ECE), జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 19
రిక్రూట్‌మెంట్ విధానం: శాశ్వత నియామకం
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2026 (రాత్రి 11:59 వరకు)
అభ్యర్థులు IIIT రాంచీ అధికారిక సమర్థ్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే, ప్రతి పోస్టుకు విడివిడిగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Advertisement

Government jobs : విద్యార్హతలు .. వయోపరిమితి

పోస్టును బట్టి విద్యార్హతలు భిన్నంగా ఉంటాయి.
డిప్యూటీ రిజిస్ట్రార్ / అసిస్టెంట్ రిజిస్ట్రార్: కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
జూనియర్ సూపరింటెండెంట్: ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు కనీసం 6 సంవత్సరాల అనుభవం.
జూనియర్ అసిస్టెంట్: కంప్యూటర్ పరిజ్ఞానంతో బ్యాచిలర్ డిగ్రీ.
జూనియర్ టెక్నీషియన్ (CSE/ECE): ఇంజనీరింగ్ డిప్లమా / బీటెక్ లేదా 2 సంవత్సరాల అనుభవంతో ఐటీఐ.
జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ): లైబ్రరీ సైన్స్‌లో డిప్లమా లేదా డిగ్రీతో పాటు అనుభవం.
వయోపరిమితి: కనీసం 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు పోస్టును బట్టి 27 నుంచి 45 సంవత్సరాల వరకు ఉంటుంది (28-02-2026 నాటికి). రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

Government jobs : జీతభత్యాలు, ఎంపిక విధానం ..దరఖాస్తు ప్రక్రియ

ఈ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన జీతభత్యాలు అందిస్తారు.
డిప్యూటీ రిజిస్ట్రార్: రూ.78,800 – రూ.2,09,200
అసిస్టెంట్ రిజిస్ట్రార్: రూ.56,100 – రూ.1,77,500
జూనియర్ సూపరింటెండెంట్: రూ.35,400 – రూ.1,12,400
జూనియర్ అసిస్టెంట్ / జూనియర్ టెక్నీషియన్: రూ.21,700 – రూ.69,100
ఎంపిక విధానం:
గ్రూప్ B & C పోస్టులకు డొమైన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అవసరమైతే స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉండవచ్చు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు సమర్థ్ పోర్టల్ (https://iiitranchint.samarth.edu.in) ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అన్ని విద్యా అనుభవ ధృవపత్రాల స్కాన్ కాపీలు అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. అప్లికేషన్ సంబంధిత సమస్యల కోసం recruitment@iiitranchi.ac.inకు మెయిల్ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఆశించే అభ్యర్థులకు IIIT రాంచీ నాన్–టీచింగ్ రిక్రూట్‌మెంట్ 2026 ఒక అరుదైన అవకాశం. అర్హులైన వారు చివరి తేదీ లోపు తప్పక దరఖాస్తు చేసుకోవాలి.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి