Home » National » Sir Form Status Check
National

SIR Form Status : ఓటర్లకు బిగ్ అప్డేట్.. BLOకి ఇచ్చిన ఫారం స్టేటస్ చెక్ ఇలా చెక్ చేసుకోండి..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 13, 2026 9:49 pm
Advertisement

SIR Form Status : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా Voter List సవరణ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐఆర్ SIR – Special Intensive Revision ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా, ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh , తెలంగాణ Telangana సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల సంఘం Election Commission of India – ECI ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు సరైన విధంగా నమోదయ్యేలా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు BLO ఇంటింటికీ వెళ్లి SIR Enumeration Form అందజేస్తున్నారు. పౌరులు ఫారం నింపి తిరిగి BLOలకు ఇవ్వొచ్చు. అలాగే ఇంటి నుంచే ఆన్‌లైన్ Online ద్వారా కూడా ఫారం సమర్పించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. దీంతో లక్షలాది మంది ఓటర్లు అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకున్నారు.అయితే చాలా మందికి ఇప్పుడు ఒకే సందేహం ఎదురవుతోంది. తాము సమర్పించిన SIR Enumeration Form ఎన్నికల సంఘానికి చేరిందా? ప్రస్తుతం దాని స్థితి SIR Enumeration Form Status ఏంటి? అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? దీనికోసమే ఎన్నికల సంఘం ప్రత్యేకంగా అధికారిక స్టేటస్ చెక్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

SIR Form Status : ఓటర్లకు బిగ్ అప్డేట్.. BLOకి ఇచ్చిన ఫారం స్టేటస్ చెక్ ఇలా చెక్ చేసుకోండి..!

SIR Form Status : SIR Enumeration Form Status ఎందుకు చెక్ చేయాలి?

ఒకసారి ఫారం సమర్పించిన తర్వాత అది విజయవంతంగా నమోదు అయిందా లేదా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఓటర్ల జాబితాలో మీ పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, EPIC Number వంటి సమాచారం ఈ ప్రక్రియ ఆధారంగానే నవీకరించబడుతుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన ఫారం పూర్తిగా అప్‌లోడ్ అయిందా, BLO ద్వారా ఇచ్చిన ఫారం నమోదు చేశారా అనే విషయాన్ని SIR Enumeration Form Status ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

Advertisement

SIR Enumeration Form Status : ఇలా చెక్ చేయండి

ఎన్నికల సంఘం ECI అధికారికంగా అందించిన SIR Form Status సదుపాయాన్ని ఉపయోగించడం చాలా సులభం. ముందుగా అధికారిక SIR Enumeration Form Status వెబ్‌పేజీని ఓపెన్ చేయాలి.అక్కడ ముందుగా మీ State (రాష్ట్రం) ఎంపిక చేయాలి. ఆ తర్వాత మీ EPIC Number Voter ID Number నమోదు చేయాలి. ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత Search బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఫారం సంబంధించిన ప్రాథమిక సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆన్‌లైన్ Online, ఆఫ్‌లైన్ Offline ఫారాల స్టేటస్ ఎలా కనిపిస్తుంది? మీరు BLO ద్వారా ఆఫ్‌లైన్‌లో ఫారం సమర్పించి ఉంటే, మీ ఫారం ఇప్పటికే స్వీకరించబడిందని Submitted స్టేటస్‌లో చూపిస్తుంది. అలాగే మీరు Online SIR Form సమర్పించి ఉంటే, మొదట మీ వివరాలు కనిపిస్తాయి. తర్వాత మీ మొబైల్ నంబర్ పక్కన Send OTP అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బటన్‌పై క్లిక్ చేస్తే మీ నమోదిత మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTP నమోదు చేసిన వెంటనే మీ SIR Enumeration Form Status పూర్తిగా స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో మీ ఫారం ప్రస్తుతం ఏ దశలో ఉందో స్పష్టంగా తెలుసుకోవచ్చు.

SIR ప్రక్రియలో ఓటర్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఎన్నికల సంఘం సూచనల ప్రకారం EPIC Number సరిగ్గా నమోదు చేయాలి. తప్పు నంబర్ నమోదు చేస్తే మీ వివరాలు కనిపించవు. మొబైల్ OTP వచ్చే వరకు పేజీని రిఫ్రెష్ చేయకూడదు. అలాగే OTP ఇతరులతో పంచుకోకూడదు. ఫారం సమర్పించిన వెంటనే స్టేటస్ కనిపించకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. BLO ద్వారా నమోదు చేసిన వివరాలు సిస్టమ్‌లో అప్‌డేట్ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది.

Advertisement

ఓటర్ల జాబితాలో వివరాలు సరిగా ఉండాలంటే ఇదే సరైన సమయం

SIR Special Intensive Revision ప్రక్రియ ప్రధాన ఉద్దేశం ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు సరైన విధంగా నమోదు కావడం. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే తుది ఓటర్ల జాబితా విడుదల అవుతుంది. అందువల్ల ఇప్పటికే SIR Enumeration Form సమర్పించిన వారు ఒకసారి తప్పకుండా తమ SIR Form Status చెక్ చేసుకోవడం మంచిది. ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే సంబంధిత BLO లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి సరిదిద్దుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే భవిష్యత్తులో ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి