Home » National » Sukanya Samriddhi Yojana Scheme Details 2
National

Sukanya Samriddhi Yojana : ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుతమైన స్కీం.. రూ.250 కడితే రూ.72లక్షలు ..వివరాలివే .. !

Authored By
Suma
The Telugu News | Updated on: February 5, 2026 1:33 pm
Advertisement

Sukanya Samriddhi Yojana : ఆడపిల్ల  girls  పుడితే తల్లిదండ్రులకు భారం అనే భావనను పూర్తిగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం  central government  ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన  Sukanya Samriddhi Yojana నేడు దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ఆశాకిరణంగా మారింది. బాలికల చదువు, పెళ్లి వంటి కీలక అవసరాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా 2015 జనవరిలో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు విజయవంతంగా 11 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. తక్కువ పెట్టుబడితో రిస్క్ లేకుండా మంచి రాబడులు అందించే పథకంగా ఇది గుర్తింపు పొందింది.

Advertisement

Sukanya Samriddhi Yojana : ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుతమైన స్కీం.. రూ.250 కడితే రూ.72లక్షలు ..వివరాలివే .. !

Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకతలు

సుకన్య సమృద్ధి ఖాతాను పాప పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల లోపు ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. కేవలం రూ.250తోనే ఖాతా తెరవడం ఈ పథకంలోని ప్రధాన ఆకర్షణ. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఖాతా తెరిచిన నాటి నుంచి 15 సంవత్సరాల పాటు పెట్టుబడి చేయాలి. ఈ పథకం ప్రభుత్వ హామీతో అమలవుతుండటంతో ఎలాంటి రిస్క్ ఉండదు. పోస్ట్ ఆఫీసులు ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఖాతా ప్రారంభించవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికల పేర్లపై ఖాతాలు తెరవడానికి కేంద్రం అనుమతించింది.

Advertisement

Sukanya Samriddhi Yojana : ఆకర్షణీయమైన వడ్డీ, భారీ రాబడులు

ప్రస్తుతం ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 8.20 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఇది ఇతర పొదుపు పథకాలతో Other savings schemes  పోలిస్తే చాలా ఆకర్షణీయమైనదిగా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్ల పాటు మొత్తం రూ.22.5 లక్షలు పెట్టుబడి చేస్తే 21 ఏళ్ల మెచ్యూరిటీ కాలానికి సుమారు రూ.49.32 లక్షల వడ్డీ లభిస్తుంది. మొత్తంగా పెట్టుబడి మరియు వడ్డీ కలిపి దాదాపు రూ.71.82 లక్షలు చేతికి వస్తాయి. ఇంకా ఈ పథకంలో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం కూడా పన్ను రహితమే కావడం మరో పెద్ద లాభం.

Sukanya Samriddhi Yojana : చదువు, పెళ్లికి ఉపయోగపడే భద్రతా పథకం

బాలిక 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య కోసం  education  ఖాతాలోని మొత్తంలో 50 శాతం వరకు ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన మొత్తం బాలికకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత లేదా ఆమె పెళ్లి సమయంలో పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆడపిల్లల విద్య, ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. చిన్న మొత్తాలతోనే దీర్ఘకాలంలో భారీ నిధులు సమకూర్చుకునే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు తమ కుమార్తెల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే పొదుపు ప్రారంభిస్తున్నారు. కాగా సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల పాలిట నిజంగా ఒక వరంలా మారింది. ఆర్థిక భద్రతతో పాటు సామాజిక దృక్పథంలోనూ మార్పు తీసుకొస్తున్న ఈ పథకం రానున్న రోజుల్లో మరింత మంది బాలికల జీవితాలను వెలుగుల్లోకి తీసుకురావడం ఖాయం.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి