Home » Andhra Pradesh » Nellore Collector Chakradhara Babu Is On Leave
andhra pradesh

Nellore.. లీవ్‌లో జిల్లా కలెక్టర్.. వ్యక్తిగత పనుల కోసం..

Authored By
praveen T
The Telugu News | Published on: September 4, 2021, 12:48 pm
Advertisement

నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధరబాబు వ్యక్తిగత పనుల కోసమై సెలవుపై వెళ్లారు. ఈ నెల 9 వరకు ఆయన లీవ్‌లో ఉంటారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వలు జారీ చేశారు. చక్రధరబాబు వచ్చేంత వరకు నెల్లూరూ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా ప్రస్తుతం రెవెన్యూ కలెక్టర్‌గా ఉన్న హరేందిరా ప్రసాద్‌ను నియమించారు. కాగా గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

ఇకపోతే కరోనా కేసులతో పాటు సీజనల్ డిసీజెస్ ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా, వైరల్ ఫీవల్ మధ్య తేడాలను గుర్తించాలని చెప్పారు. ఏ కొద్ది అనుమానం వచ్చినా వెంటనే టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం మస్ట్ అని సూచించారు. ఇకపోతే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కొవిడ్ జాగ్రత్తలు పాటించడం మరిచిపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి