
actress trisha to join in congress soon
Trisha : నటి త్రిష తెలుసు కదా. మూడు పదుల వయసు దాటినా ఇంకా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొని ఇంకా అవకాశాలు చేజిక్కించుకుంటోంది. మూడు పదుల వయసు దాటినా తన అందం కూడా ఇప్పటి వరకు ఏమాత్రం చెక్కు చెదరలేదు. అంతేనా.. ఇప్పటికీ తన అందంతో వయ్యారాలు ఒలకబోస్తూ త్రిష ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే.. సినిమాలతో పాటు త్రిష.. రాజకీయాలపై కూడా ఆసక్తి చూపుతోందట. త్వరలో త్రిష రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. తను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతోందనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. త్వరలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
actress trisha to join in congress soon
ఈ యాత్ర సందర్భంగా తను కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే వార్తలు తమిళనాడులో చర్చనీయాంశం అయ్యాయి. త్వరలోనే రాహుల్ గాంధీ సమక్షంలో తను కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి తమిళనాడు నుంచి సినీ రంగంలో ఉన్న పలువురు ప్రముఖులు రాజకీయాల్లో రాణించారు. ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) దగ్గర్నుంచి.. ఖుష్బూ, కమల్ హాసన్ వరకు అందరూ రాజకీయాల్లో ఉన్నవారే. ఇప్పుడు ఆ లిస్టులో త్రిష కూడా చేరబోతోంది.
ప్రస్తుతం తన చేతినిండా సినిమాలు ఉన్నాయి. పొన్నియన్ సెల్వన్ సిరీస్, ది రోడ్, చతురంగ వెట్టై, రామ్ 1 లాంటి సినిమాలతో బిజీగా ఉన్న త్రిష.. ఈ సినిమాల తర్వాత సినిమాలను తగ్గించి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ప్లాన్ వేసుకుందట. సినిమాలన్నీ పూర్తయ్యాక.. పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టి రాజకీయాల్లోనే రాణించాలనేది త్రిష కోరికగా తెలుస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీకి త్రిష గ్లామర్ కూడా తోడు అయితే.. వచ్చే ఎన్నికల్లో తమిళనాడుతో పాటు సౌత్ ఇండియాలో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.