ariyana and sohel fight over social media
Ariyana : బిగ్ బాస్ 4 తెలుగు రియాల్టీ షో గురించి తెలుసు కదా. ఆ షోలో ఎక్కువ పాపులర్ అయింది ఇద్దరే. ఒకరు సోహెల్, మరొకరు అరియానా. వీళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీలా హౌస్ లో ఉన్నంత సేపు తెగ కొట్టేసుకున్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు వాళ్ల మధ్య ఒకటే గొడవ. చీటికి మాటికి వాళ్లు గొడవ పెట్టుకోవడమే తప్పితే ఇంకో పని లేదు. అయితే.. బయటికి వచ్చాక ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరూ బాగానే ఉంటున్నారు. బయట వాళ్లిద్దరి మధ్య స్నేహం ఇంకా పెరిగింది.
ariyana and sohel fight over social media
నిజానికి.. బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అందరికీ.. బాగానే పాలోయింగ్ పెరిగింది. అయితే.. సోహెల్, అరియానా గొడవలే సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచాయి. బిగ్ బాస్ నడిచినన్ని రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ల వీడియోలే. అంతలా వాళ్లిద్దరికి పాపులారిటీ లభించింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక.. సోహెల్ కు, అరియానాకు ఇద్దరికీ పాపులారిటీ బాగానే రావడంతో.. వాళ్లు సెలబ్రిటీలు అయిపోయారు. దీంతో తమ అభిమానులకు టచ్ లో ఉండటం కోసం సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటారు. తాము చేసే పనులు, పర్సనల్ విషయాలు, సినిమాల గురించే ఎప్పుడూ మాట్లాడుతుంటారు. పోస్టులు పెడుతుంటారు.
తాజాగా సోహెల్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అది బిగ్ బాస్ కు లింక్ ఉన్నదే. బిగ్ బాస్ హౌస్ లో చింటు అని అరియానాకు చెందిన ఓ టెడ్డీ బేర్ ఉండేది. దానితో హౌస్ లో సోహెల్ బాగానే ఆడుకున్నాడు. బయటికి వచ్చాక ఆ చింటు బొమ్మను తన దగ్గరే ఉంచేసుకున్నాడట. అయితే.. తాజాగా తను ఆ బొమ్మపై ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం.. ఈ వీడియోను పోస్ట్ చేశాడు. నాకు ఉన్న ఒకే ఒక శత్రువు వీడే. వీడిని వదిలేది లేదు. నన్ను ఆపొద్దు. వీడు లేకపోతే.. నా ప్రయాణం వేరేలా ఉండేది. నా శత్రుత్వంలో మీరు కూడా పాల్గొనండి. నాకు ఎవరి మీద పగ లేదు కానీ.. వీడి మీదే ఉంది. అంటూ ఆ చింటు బొమ్మ గురించి చెబుతూ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసిన అరియానా.. అరేయ్.. చంపేస్తా నిన్ను. వాడిని అమ్మడానికి వీలులేదు.. అంటూ చెబుతూనే హ్యాపీ ఫాథర్స్ డే రా సోహెల్ గా అంటూ పోస్ట్ పెట్టింది అరియానా. అంటే.. ఇదంతా ఉత్తుత్తి వీడియో అన్నమాట. ఏది ఏమైనా సోహెల్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు. తన అభిమానులతో టచ్ లో ఉండటం కోసం.. ఏదో ఫన్ కోసం ఈ వీడియోను పోస్ట్ చేసి ఉంటాడు సోహెల్. అది అసలు కథ.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.