Venu Swamy : ఇటీవల భారతదేశంలో ఐపీఎల్ 2024 లో భాగంగా 17వ సీజన్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్ లో అందరిని దాటుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్స్ మాత్రమే ఫైనల్ వరకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్ లో SRH నీ KKR చిత్తుగా ఓడించింది. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ట్రోల్స్ బారిన పడుతూ ఉండే వేణు స్వామి మరోసారి ట్రోలింగ్ కి గురయ్యారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వేణు స్వామి ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీల్ కప్ సాధిస్తుందని కామెంట్ చేయడం జరిగింది. కానీ వేణు స్వామి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఇక ఈ విషయంపై వేణు స్వామి మీద సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. అయితే వేణు స్వామి ఈ ట్రోలింగ్స్ పై స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని ఆపేశక్తి మనకి ఉండదు. హైదరాబాద్ జట్టు అనేది లిస్టులో లేనటువంటి జట్టు అయితే కావ్య మరన్ జాతకంలో దోషాలు ఉన్నంతవరకు హైదరాబాద్ డిజాస్టర్ గానే ఉంటుంది. ప్రస్తుతం ఆమె జాతకంలో మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు మంచి కాలం నడుస్తుంది కాబట్టి ఆమెది అప్పర్ హ్యాండ్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ జట్టు కూడా మంచిగా రాణించింది. అయితే ఇక్కడ నేను కచ్చితంగా SRH గెలుస్తుందని చెప్పలేదు. గెలిచే అవకాశాలు ఉంటాయని మాత్రమే చెప్పాను. కాబట్టి జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. ఈ శాస్త్రం ద్వారా సమాజంలో జరగబోయే విషయాలను విపరుస్తూ జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ జ్యోతిష్యం పట్ల నమ్మకాన్ని తీసుకువస్తూన ప్రక్రియలో భాగంగా జరుగుతున్న వ్యవహారమే ఈ ట్రోలింగ్.
అయితే ఇక్కడ వేణు స్వామిని ట్రోల్ చేయడం వలన మిమ్స్ షేర్ చేయడం వలన ,వేణు స్వామిని టార్గెట్ చేయడం వలన జరగబోయేటువంటి ఫలితాలు వచ్చేటటువంటి ఫలితాలు అయితే మారావు. జరగాల్సినవి జరుగుతేనే ఉంటాయి. అయితే ప్రతిసారి నన్ను ఇలానే టార్గెట్ చేస్తూ ఉంటారు. చలికాలం తర్వాత వానాకాలం ఎండాకాలం ఎలానో నా మీద ట్రోలింగ్ అలానే ఉంటుంది. 2017, 18,19 లో కూడా ఇలానే టార్గెట్ చేశారు. నేను చెప్పనివి కూడా చెప్పాను అని ట్రోలింగ్స్ చేశారు. చాలామంది దీని ద్వారా ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. ఈ ట్రోలింగ్ అయితే సర్వసాధారణం కాబట్టి దానిని లైట్ తీసుకోవడం మంచిదని వేణు స్వామి సందర్భంగా తెలియజేశారు.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.