Balakrishna : బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా బిబి3. ప్రస్తుతం ఈ పేరుతోనే బాలకృష్ణ గురించి అన్ని రకాల అప్‌డేట్స్ వస్తున్నాయి. కాని అసలు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టైటిల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. అయితే ఎట్టకేలకి బాలకృష్ణ సినిమా టైటిల్ ని ప్రకటించడానికి దర్శకుడు బోయపాటి శ్రీను డేట్ అలాగే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సింహ, లెజెండ్ సినిమాల మాదిరిగానే భారీ హిట్ సక్సస్ అందుకొని హాట్రిక్ హిట్ కొట్టాలని బోయపాటి- బాలకృష్ణ ఎంతో కసిగా ఉన్నారు.
balakrishna-movie-title-announcement-date-is-fixed-by-boyapati
అందుకే ఈ ఇద్దరికి బాగా కలిసి వచ్చిన మాస్ ఓరియెంటెడ్ కథతోనే ఈ హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. బిబి 3 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే ప్రకటించారు చిత్ర యూనిట్. మే నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
కాగా ముందు నుంచి ఎక్కువగా ప్రచారంలో ఉన్న మోనార్క్ అన్న టైటిల్ ఫైనల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ టైటిల్ తో పాటు పలు టైటిల్ కూడా ప్రచారంలో నిలిచాయి. కాని కథలోని బాలయ్య క్యారెక్టర్ ప్రకారం మోనార్క్ అన్న టైటిల్ పర్‌ఫెక్ట్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మార్చ్ 11 న మహా శివరాత్రి పండుగ సందర్భంగా టైటిల్ ని ప్రకటించేందుకు బోయపాటి శ్రీను టీం డేట్ ఫిక్స్ చేశారట. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.