brs party bumper offer to party workers who take membership
BRS Membership : బీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి. ఈ పార్టీ ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే కాదు.. యావత్ దేశమంతా విస్తరించింది. ఇప్పటికే తెలంగాణకు బార్డర్ గా ఉన్న కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. ఆ రాష్ట్రాల్లో పార్టీని యాక్టివ్ చేసేందుకు కొందరు బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ ఆ పనిని అప్పగించారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా ప్రారంభం అయింది. అయితే.. తెలంగాణ తెలుగు రాష్ట్రం కావడంతో మరో తెలుగు రాష్ట్రం అయిన ఏపీపై ముందు
ఫోకస్ పెంచారు సీఎం కేసీఆర్. అక్కడ కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దాన్ని క్యాష్ చేసుకునేందుకు.. ఏపీలో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ పెట్టినందుకు శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా ఏపీలో పలు చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు.. బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఘన స్వాగతం పలికారు. అందుకే.. తెలంగాణ తర్వాత కేసీఆర్ టార్గెట్ ఏపీకి షిఫ్ట్ అయింది. అయితే.. ఏపీలో త్వరలోనే పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
brs party bumper offer to party workers who take membership
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పెషల్ కేర్ తీసుకోనున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ఏపీలో వేగవంతం చేశారు. అలాగే.. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వాళ్లకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. దాని కోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ ను ఏర్పాటు చేశారు. 9491015222 అనే నెంబర్ కు ఫోన్ చేసి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. దీని వల్ల.. బీమా సౌకర్యం కూడా కల్పిస్తారు కాబట్టి.. చాలామంది ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.