Buddha Venkanna over action chandrababu birthday event
TDP : రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా రావని ఆ పార్టీ నాయకులకు అర్థమైందేమో.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పరిమితం పోతున్నామని ముందుగానే భావించారేమో.. అందుకే తెలుగు దేశం పార్టీ తమ్ముళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరం గా ఉన్నాయి అంటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హంగామా చేశారు.
జిల్లా కేంద్రాల్లో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జోలికి వస్తే చంపేస్తామని హెచ్చరించారు. చంద్రబాబుపై గాని ఆయన కుటుంబంపై పిచ్చి వేషాలు వేసే బ్యాచ్ కి కఠిన శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. అనవసరంగా నోరు పారేసుకుని చంద్రబాబు నాయుడు గారి పై విమర్శలు చేసే వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని బుద్ధ వెంకన్న అన్నాడు.
Buddha Venkanna over action chandrababu birthday event
చంద్రబాబు నాయుడు కోసం చంపడానికి చావడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నాడు. ఇందు కోసం వంద మంది సూసైడ్ బ్యాచ్ ను కూడా సిద్ధం చేశామని ఆయన ప్రకటించాడు. బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం లేపుతున్నాయి. స్వయంగా తెలుగు దేశం పార్టీలోనే ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు మంచిది కాదని, విమర్శలు చేసినంత మాత్రాన హత్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.