Home » Andhra Pradesh » Chandrababu Big Sh0ck To Ashok Gajapathi Raju
andhra pradesh

Ashok Gajapathi Raju : అశోక్ గజపతి రాజు కి బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు !

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 21, 2023, 10:00 pm
Advertisement

Ashok Gajapathi Raju : రాబోయేది ఎన్నికల కాలం. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి అన్ని పార్టీలు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేదానిపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఆశావహులకు టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. విజయనగరం ఎంపీగా ఈసారి పోటీ చేయాలని అనుకున్న అశోక్ గజపతి రాజుకు చంద్రబాబు షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆశోక్ గజపతి రాజుకి వయసు మీదపడింది.

Advertisement

chandrababu big sh0ck to ashok gajapathi raju

అందులోనూ గత ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తన కూతురు అదితిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇద్దరూ ఓడిపోవడంతో ఈసారి ఇద్దరికీ టికెట్లు ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారట. ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకా.. ఇద్దరికీ టికెట్లు ఇవ్వడం కుదరదు అని క్లారిటీ ఇచ్చేశారట చంద్రబాబు. అయితే.. ఈసారి విజయనగరం ఎంపీగా కాదు.. విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రాజు గారిని చంద్రబాబు కోరారట. తన కూతురికి మాత్రం టికెట్ ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేశారట చంద్రబాబు. దీంతో తన కూతురును రాజకీయాల్లో యాక్టివ్ చేయాలనుకున్న అశోక్ గజపతి రాజు ఆశలు అడియాశలు అయినట్టే అని తెలుస్తోంది.

Advertisement

Ashok Gajapathi Raju : కూతురికి టికెట్ ఇవ్వడం కుదరదా?

తను ఉన్నప్పుడే కూతురును రాజకీయాల్లో సెటిల్ చేయాలని అనుకున్న రాజు గారి కల.. కలగానే మిగిలిపోతుందని బాధపడుతున్నారట. నిజానికి అశోక్ గజపతి రాజు.. ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా అలంకరించారు. కానీ.. 2019 ఎన్నికల్లో ఇద్దరూ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు వాళ్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అసలు తనకూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారట చంద్రబాబు. చూద్దాం మరి ఎన్నికల వరకు చంద్రబాబు నిర్ణయం మారుతుందో లేదో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి