old man hilarious comments chandrababu
ChandraBabu : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసిలో అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికల కోసం రెండు పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈమధ్య మాట్లాడుతున్న మాటలన్నీ చాలా విచిత్రంగా ఉంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఆయనకు ముందే బోధపడిందా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఆయనకు ఒక్కసారిగా తన భవిష్యత్తు ఏంటో తెలిసినట్టు ఉంది. అందుకే అలా మాట్లాడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏంటో చంద్రబాబుకు అర్థం అయినట్టు అనిపిస్తంది. ఇటీవల కర్నూలు పర్యటనలోనూ ఇవే నా చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు మాట్లాడటం అందరం విన్నాం. అక్కడే కాదు.. ఎక్కడ మాట్లాడినా కూడా టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. మీరు గెలిపిస్తే సరి.. లేదంటే ఇవే నా చివరి ఎన్నికలు అని కర్నూలులో డైరెక్ట్ గానే మాట్లాడారు చంద్రబాబు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. తెలంగాణలో పార్టీ భూస్థాపితం అయిపోయింది. అయినప్పటికీ పార్టీ కార్యకలాపాలు మాత్రం కొనసాగుతున్నాయి.
Chandrababu forecasting his future
టీడీపీ నేతలు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు కానీ.. ఏదో పేరుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాత్రం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏంటి పరిస్థితి అంటే.. ఖచ్చితంగా తెలంగాణలో పార్టీకి పట్టిన గతే ఏపీలోనూ పట్టనుంది. అయితే.. ఓవైపు పార్టీకి 160 సీట్ల వరకు వస్తాయంటూ చెబుతున్న పార్టీ అధినేత.. రాబోయే ఎన్నికల్లో చివరి ఎన్నికలు అనడంలో ఆంతర్యం ఏంటి అనేది ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. అయితే.. ప్రజల్లో సానుభూతి పొందేందుకు.. టీడీపీ కార్యకర్తలను బెదిరించి అయినా పని చేసుకోవడం కోసం.. ఇవే చివరి ఎన్నికలు అని భయపెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నారా? అసలు ఆయన వ్యూహం ఏంటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.