Home » Andhra Pradesh » Chandrababu News Politics In Gudivada Constituency
andhra pradesh

Kodali Nani – Chandrababu : కొడాలి నాని అడ్డాలో చంద్రబాబు..!!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 5, 2022, 9:40 pm
Advertisement

Kodali Nani – Chandrababu : ఏపీ రాజకీయాల్లో గుడివాడకు ఉన్న ప్రత్యేకతే వేరు. కృష్ణా జిల్లాలో ఉన్న గుడివాడ నియోజకవర్గంలో జరిగే రాజకీయాలు మరే నియోజకవర్గంలో జరగవు. ఎందుకంటే.. అక్కడ కొడాలి నాని పాతుకుపోయారు. నిజానికి.. అది టీడీపీ కంచుకోట. కానీ.. ఎప్పుడైతే వైసీపీ ఎంటర్ అయిందో కొడాలి నాని రెండు సార్లు వైసీపీ నుంచి కూడా అక్కడ గెలిచారు. అంతకు ముందు రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు 2024 లో కూడా సై అంటే సై అంటున్నారు. పోటీకి మళ్లీ రెడీ అయిపోతున్నారు. నిజానికి కొడాలి నాని మాస్ లీడర్. ఆయన మాస్ అప్పీల్ చూసి జనాలు, ఇతర నేతలు భయపడాల్సిందే. ఆయన భాషే అలా ఉంటుంది.

Advertisement

నానికి ఆ నియోజకవర్గంలో పెద్ద పేరే ఉంది. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను గౌరవిస్తుంటారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా గత 20 ఏళ్ల నుంచి కొడాలి నానిని గెలిపిస్తూ వస్తున్నారు. అయితే.. 2019 ఎన్నికల్లో గెలిచి ఎప్పుడైతే నాని మంత్రి పదవి అలంకరించారో అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.ఈనేపథ్యంలో చంద్రబాబుతో పాటు ఆయన ఫ్యామిలీని కూడా కొడాలి నాని రాజకీయాల్లోకి లాగారు. దీంతో టీడీపీ తమ్ముళ్లు కూడా ఎలాగైనా నానిని ఓడించాలని పట్టుబడుతున్నారు. టీడీపీ వేరే నియోజకవర్గాల్లో గెలిచినా గెలవకపోయినా గుడివాడలో మాత్రం ఎలాగైనా నానిని ఓడించాలని అనుకుంటున్నారు.

chandrababu news politics in gudivada constituency

Advertisement

Kodali Nani – Chandrababu : చంద్రబాబు ఫ్యామిలీని కూడా రాజకీయాల్లోకి లాగిన కొడాలి నాని

అయితే నానిని ఓడించడం అంత ఈజీ టాస్క్ కాదు. అందుకే గుడివాడలో కొడాలి నానికి ధీటైన క్యాండిడేట్ ను దించడం కోసం టీడీపీ కసరత్తులు చేస్తోంది. చంద్రబాబు కూడా గుడివాడ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అప్పుడు గుడివాడలోనూ పర్యటించి అక్కడ టీడీపీని స్ట్రాంగ్ చేసేందుకు వ్యూహాలను రచించనున్నారు. చూద్దాం మరి కొడాలి ఇలాకాలో మళ్లీ టీడీపీ తన జెండాను వచ్చే ఎన్నికల్లో అయినా పాతుతుందో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి